తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తరువాత టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో కేసీఆర్, రేవంత్‌రెడ్డి హోరాహోరీగా ప్రచారం చేశారు. కామారెడ్డిలో కేసీఆర్‌ని ఓడగొడుతున్నామంటూ రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం తథ్యమని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నాయకులు, కార్యకర్తలు సంబరాలు మొదలుపెట్టాలని పిలుపునిచ్చారు. ఎగ్జిట్ పోల్స్ పలితాలపై హర్షం వ్యక్తం చేశారు. డిసెంబర్ 9న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోందని చెప్పారు. ఇన్నాళ్లూ అధికారమే శాశ్వతమని కేసీఆర్ నమ్మారని, తెలంగాణ ప్రజల్లో చైతన్యం వచ్చిందని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో డిసెంబర్ 3న శ్రీకాంతాచారి తుదిశ్వాస విడిచారని, అదే రోజున ఎన్నికల ఫలితాలు వెల్లడవుతున్నాయని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
Revanth Reddy : కామారెడ్డిలో కేసీఆర్‌ని ఓడగొడుతున్నాం – రేవంత్ రెడ్డి

Revanth Reddy