టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. షేక్ పేటలో ఉన్న ప్రభుత్వ భూమిలో అవకతవకలు జరిగాయంటూ ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. షేక్ పేట మండలం షేక్ పేట గ్రామంలోని సర్వే నెంబర్ 327లో 30 ఎకరాలకు పైగా భూములు తమవే అంటూ ప్రభుత్వం కోర్టులో వాదిస్తోందని…ఇప్పుడు తుది తీర్పునకు లోబడే తాము ఆ భూములకు సంబంధించిన విషయాల్లో ముందుకు వెళ్తున్నామంటూ…షరతులతో ప్రైవేట్ వ్యక్తులకు జీహెచ్ ఎంసీ తుదిలే అవుట్ అనుమతులు ఇచ్చినట్లు అందులో పేర్కొన్నారు. ఆ అంశాలను ప్రస్తావిస్తూ…తెలంగాణ ప్రభుత్వంపై రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు.
మున్సిపల్ మంత్రి కేటీఆర్ కు తెలియకుండా ఈ దోపిడి సాధ్యమవుతుందా..? తెలంగాణ సీఎం ఆదేశాలు లేకుండా సీఎస్, మున్సిపల్ కమిషనర్ లు ఇలా బరితెగించే ఛాన్స్ ఉందా..? సర్వే నెంబర్ 327లో లే అవుట్ అనుమతులు రద్దు చేయాల్సిందే. ప్రభుత్వ భూమిని కాపాడాలి. నగరం నడిబొడ్డున రూ. 2000కోట్ల దోపిడి వెనకున్న ముఠా నాయకుడు ఎవరంటూ ప్రశ్నించారు. ప్రభుత్వ భూములను కాపాడాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు.
నగరం నడిబొడ్డున రూ.2000 కోట్ల దోపిడీ వెనుక ఉన్న ముఠానాయకుడు ఎవరు?
మున్సిపల్ మంత్రి @KTRTRS కి తెలియకుండా ఈ దోపిడీ సాధ్యమా?@TelanganaCMO ఆదేశాలు లేకుండా సీఎస్, మున్సిపల్ కమిషనర్ లు ఇంతలా బరితెగించగలరా?
సర్వే నెంబర్ 327 లో లే ఔట్ అనుమతులు రద్దు చేయాలి.ప్రభుత్వ భూమిని కాపాడాలి. pic.twitter.com/EgjawDD5Iu
— Revanth Reddy (@revanth_anumula) April 10, 2022