PCC Chief:రేవంత్ సంతోష్ ట్విట్టర్ వార్

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్, టీపీసీసీ చీఫ్ రేవంత్ మధ్య ట్విట్టర్ వేదికగా ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది.

Published By: HashtagU Telugu Desk
revanth reddy arrest

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్, టీపీసీసీ చీఫ్ రేవంత్ మధ్య ట్విట్టర్ వేదికగా ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్, దానికి నిరసనగా జేపీ నడ్డా ప్రొటెస్ట్ పై రేవంత్ స్పందించారు. బీజేపీ, టీఆర్ఎస్ కలిసి డ్రామా ఆడుతున్నాయని, ఇదంతా రాజకీయ దొంగాట అని అర్ధం వచ్చేలా రేవంత్ ట్వీట్ చేశారు.

రేవంత్ కామెంట్స్ పై స్పందించిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ స్పందిస్తూ…
మీరు అలా వెక్కిరిస్తూ ఉండండి. బీజేపీ మంట మీకు తాకితే అర్పకోవడానికి హుసేన్ సాగర్ ఉందని, 2023 లో చూసుకుందామని సంతోష్ ట్వీట్ చేశారు.

బీజేపీ నేత సంతోష్ ట్వీట్ కు రేవంత్ ఘాటుగా సమాధామిచ్చారు. టీఆర్ఎస్, బీజేపీ ఆటలు తెలంగాణ ప్రజలు అర్థం చేసుకున్నారని, బీజేపీని ప్రజలు బంగాళాఖాతంలో కలుపుతారని, 2023లో చూసుకుందామని రేవంత్ రీట్వీట్ చేశారు. మేము కాంగ్రెసు వాళ్ళమని, ఎవరికి భయపడమని కానీ బీజేపీ, టీఆర్ఎస్ భాయిభాయి అని రేవంత్ తన ట్వీట్ లో పేర్కొన్నారు.

  Last Updated: 04 Jan 2022, 11:30 PM IST