BJP Manifesto 2024 : బీజేపీ మేనిఫెస్టోఫై సీఎం రేవంత్ కామెంట్స్

ప్రజలు ఏం చేస్తామో చెప్పకుండా ఆ పార్టీ ఎన్నికల రణరంగంలోకి దిగుతోందని ఆరోపించారు

  • Written By:
  • Updated On - April 14, 2024 / 05:17 PM IST

లోక్ సభ (LoK Sabha) ఎన్నికల నేపథ్యంలో బిజెపి తమ మేనిఫెస్టో (BJP Manifesto)ను రిలీజ్ చేసింది. రెండుసార్లు అధికారం చేపట్టిన బిజెపి..ముచ్చటగా మూడోసారి అధికారం చేపట్టాలని సన్నాహాలు చేస్తుంది. ఈ క్రమంలో ఈరోజు శనివారం సంకల్ప పత్ర పేరుతో బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసింది. మోడీ గ్యారెంటీ, 2047 నాటికి వికసిత భారత్ థీమ్‌తో 14 అంశాలతో ఎన్నికల మేనిఫెస్టోను బీజేపీ రూపొందించింది. అభివృద్ధి, దేశ శ్రేయస్సు, యువత, మహిళలు, పేదలు, రైతులే ప్రధాన అజెండాగా సంకల్పపత్ర రూపకల్పన చేశారు. ఈ మేనిఫెస్టో ఫై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) స్పందించారు.

బీజేపీ మేనిఫెస్టో కాలం చెల్లిన చెక్కులాంటిదని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ప్రజలు ఖచ్చితంగా తిరస్కరిస్తారని ధీమా వ్యక్తం చేసారు. ప్రజలు ఏం చేస్తామో చెప్పకుండా ఆ పార్టీ ఎన్నికల రణరంగంలోకి దిగుతోందని ఆరోపించారు. రాహుల్ నేతృత్వంలోని కాంగ్రస్ ప్రజల కష్టాలను తీర్చేందుకు ప్రయత్నిస్తోందని అన్నారు. ఏది ఏమైనా ఈసారి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం పక్కా అని స్పష్టం చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇక బిజెపి మేనిఫెస్టో (BJP Manifesto) హామీలు చూస్తే..

  • 70 ఏళ్లు పైబడిన వృద్ధిలకు ఆయుష్మాన్‌ భారత్‌లో భాగంగా రూ.5 లక్షల వరకు ఉచిత వైద్యం
  • పేదలకు మరో 3 కోట్ల ఇళ్లు కట్టించడం
  • పైపు ద్వారా ఇంటింటికీ గ్యాస్‌ అందజేత
  • వచ్చే ఐదేళ్లలో 3 కోట్ల మంది మహిళలను లక్షాధికారులు చేసే దిశగా కృషి
  • దివ్యాంగుల ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా ఇళ్ల నిర్మాణం
  • ట్రాన్స్‌జెండర్లకు సైతం ఆయుష్మాన్‌ భారత్‌
  • మూడు కోట్ల మంది మహిళలను లక్షాధికారులకు మార్చే ప్రణాళిక
  • ముద్ర రుణాల పరిమితి పెంపు
  • ముద్ర రుణాల పరిమితి రూ.20 లక్షలకు పెంపు
  • డెయిరీ సహకార సంఘాల సంఖ్య పెద్ద సంఖ్యలో పెంపు
  • కూరగాయల సాగు, వాటి నిల్వ కోసం కొత్త క్లస్టర్లు
  • మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం
  • మత్స్య ఉత్పత్తి, ప్రాసెసింగ్‌ కోసం ప్రత్యేక క్లస్టర్లు
  • ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యం
  • సముద్ర నాచు, ముత్యాల సాగు దిశగా మత్స్యకారులను ప్రోత్సహించడం
  • నానో యూరియా వినియోగం మరింత పెంచడం
  • UCC, జమిలి ఎన్నికలపై హామీ
  • చిన్నరైతుల లబ్ధి కోసం శ్రీఅన్న సాగు ప్రోత్సాహం
  • స్వయం సహాయక సంఘాలకు మరింత మద్దతు
  • ప్రపంచవ్యాప్తంగా తిరువళ్లువర్‌ సాంస్కృతిక కేంద్రాల ఏర్పాటు
  • తమిళ భాష ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేయడానికి కృషి
  • యూనిఫాం సివిల్​ కోడ్​ అమలు చేయడం
  • జమిలి ఎన్నికల నిర్వహణ
  • అంతరిక్షంలో భారతీయ స్పేస్​ స్టేషన్ నిర్మించడం
  • ప్రపంచంలో మూడో ఆర్థిక వ్యవస్థగా భారత్​ను నిర్మించడం
  • ఐరాస భద్రతా మండలిలో శాస్వత సభ్యత్వం దిశగా ప్రయత్నం
  • ఉపాధి అవకాశాలను మెరుగుపర్చే కొత్త శాటిలైట్‌ పట్టణాల ఏర్పాటు
  • విమానయాన రంగానికి ఊతం
  • వందేభారత్‌ విస్తరణ
  • దేశ ఉత్తర, దక్షిణ, తూర్పు ప్రాంతాల్లోనూ బుల్లెట్‌ రైలు
  • రక్షణ, వంటనూనె, ఇంధన రంగాల్లో స్వయం సమృద్ధి
  • గ్రీన్‌ ఎనర్జీ ఉత్పత్తి, వినియోగానికి ప్రోత్సాహం
  • గ్రీన్‌ ఎనర్జీ, ఫార్మా, సెమీ కండక్టర్‌, ఎలక్ట్రానిక్స్‌, ఇన్నోవేషన్‌, లీగల్‌ ఇన్సూరెన్స్‌, వాహన రంగాల్లో ప్రపంచ స్థాయి హబ్‌ల ఏర్పాటు
  • అంతరిక్ష రంగంలో భారత సామర్థ్యాన్ని పెంచేందుకు కచ్చితమైన ప్రణాళిక
  • విదేశాల్లోని భారతీయుల భద్రతకు హామీ

Read Also : CM Jagan Attack: జగన్ పై రాళ్ళ దాడి.. బరిలోకి దిగిన ఎలక్షన్ కమిషన్