TCongress: రైతు బంధు నిబంధనలపై రేవంత్‌ సర్కార్‌ కీలక నిర్ణయం, వారికే డబ్బులు?

  • Written By:
  • Publish Date - February 15, 2024 / 12:17 AM IST

TCongress: రైతు బంధు నిబంధనలపై రేవంత్‌ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 5 ఎకరాల లోపు వారికే రైతుబంధు ఇవ్వాలనే ఆలోచలనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. గత ఏడాది వానాకాలం లెక్కల ప్రకారం 68.99 లక్షల మందికి రైతు బంధు సాయం అందింది. 5 ఎకరాల లోపు భూమి ఉన్న రైతుల సంఖ్య 62.34 లక్షలు. 5 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న..రైతుల సంఖ్య 6.65 లక్షలు ఉన్నట్లు రిపోర్టులు చెబుతున్నాయి. వీరి వద్దే మొత్తం 50 లక్షల ఎకరాలు నివేదికలో పేర్కొన్నాయి. 5 ఎకరాల లోపు వారికి రైతుబంధు ఇవ్వాలంటే ఏడాదికి రాష్ట్ర ప్రభుత్వానికి రూ. 15 వేల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు అధికారులు.

ఇలా చేస్తే ఏడాదికి రూ.7 వేల కోట్లు ఆదా అవుతాయని ప్రభుత్వ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వంలో విచ్చలవిడిగా రైతు బంధు ఇచ్చిందని రేవంత్‌ సర్కార్ ఆరోపణలు చేసింది. కొండలు, గుట్టలకు కూడా కేసీఆర్‌ రైతు బంధు ఇచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో జరిగిన చిట్ చాట్ లో అన్నారు. గత ప్రభుత్వ తప్పిదాలను సరి చేస్తామని సీఎం రేవంత్‌ తెలిపారు.తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువు దీరింది.. ఇచ్చిన హామీలను నెరవేరుస్తుంది.. తమ కష్టాలు తీరుతాయని అనుకున్న రైతుల ఆశలు ఆవిరి అయ్యాయి. దీనికి కారణం రైతు బంధు నిధులు ఇంకా తమ ఖాతాలో జమ కాకపోవడమే.

అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు భరోసా కింద ఎకరాకు రూ.15,000 ఆర్థిక సాయాన్ని అందిస్తామన్న కాంగ్రెస్ పార్టీ.. గత ప్రభుత్వం ఖజానాను ఖాళీ చేసిందని, ఈ దఫా పాత పద్దతిలోనే రైతు బంధు ఇస్తామని ప్రకటించింది. అయితే… నెలలు గడుస్తున్నా తమ ఖాతాలో రైతు బంధు సాయం ఇంకా జమ కాకపోవడంతో పెట్టుబడి సాయం కోసం దళారుల దగ్గర అప్పు చేస్తున్నారు.