PV Ramesh : అధికారులను వదిలేసి.. మాజీ సీఎంను అరెస్ట్‌ చేయడమేంటి : పీవీ రమేశ్‌

PV Ramesh : ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ కుంభకోణం వ్యవహారంలో విశ్రాంత ఐఏఎస్‌ అధికారి, చంద్రబాబు హయాంలో ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శిగా వ్యవహరించిన పీవీ రమేశ్‌ ఇచ్చిన స్టేట్మెంటే కీలకంగా మారిందంటూ మీడియాలో వార్తలు వచ్చాయి.

  • Written By:
  • Publish Date - September 11, 2023 / 11:52 AM IST

PV Ramesh : ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ కుంభకోణం వ్యవహారంలో విశ్రాంత ఐఏఎస్‌ అధికారి, చంద్రబాబు హయాంలో ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శిగా వ్యవహరించిన పీవీ రమేశ్‌ ఇచ్చిన స్టేట్మెంటే కీలకంగా మారిందంటూ మీడియాలో వార్తలు వచ్చాయి. వీటిపై ఆయన ఇవాళ ఘాటుగా స్పందించారు. ‘‘నా స్టేట్‌మెంట్‌ ఆధారంగానే కేసు పెట్టారనడం సరికాదు’’ అని స్పష్టం చేశారు. ‘‘నేను సీఐడీ వాళ్లకు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగానే చంద్రబాబును అరెస్ట్‌ చేశారనడం కరెక్ట్ కాదు. నేను అప్రూవర్‌గా మారాననే ప్రచారం పచ్చి అబద్ధం. అసలు ఫైలే లేకుండా కేసులు ఎలా పెడతారు?  స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ పై రాసిన నోట్‌ ఫైల్స్‌ ఏమయ్యాయి? వాటిని చూస్తే అన్ని విషయాలు స్పష్టంగా తెలుస్తాయి’’ అని పీవీ రమేశ్ చెప్పారు.

Also read : 23 Sentiment For Chandrababu : మళ్లీ చర్చగా మారిన చంద్రబాబు ’23’

‘‘స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ కేసు వ్యవహారంలో సీఐడీ తీరుపైనే అనుమానం కలుగుతోంది. నేను చెప్పింది సీఐడీ తనకు అనుకూలంగా మార్చుకుందనే అనుమానం వస్తోంది. గతంలో నిధులు విడుదల చేసిన వారిలో కొందరి పేర్లు ఈ కేసులో లేనే లేవు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ఎండీ, కార్యదర్శి పాత్రే ప్రధానం.. వారి పేర్లు ఎక్కడా కనిపించడం లేదే ?’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘సీఎం స్థానంలో ఉన్నవాళ్లు  ప్రతి ప్రభుత్వ బ్యాంక్‌ అకౌంట్‌లో ఏం జరుగుతుందో చూడలేరు. సీఎం స్థాయి వాళ్లు అధికారుల మీద ఒత్తిడితెచ్చి డబ్బులు రిలీజ్‌ చేయించరు. ఆనాడు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ లో తప్పులు చేసిన అధికారులను వదిలేసి.. మాజీ సీఎంను అరెస్ట్‌ చేయడమేంటి? ’’అని పీవీ రమేశ్‌ (PV Ramesh) ప్రశ్నలు సంధించారు.