Site icon HashtagU Telugu

Vizag Vijayawada Flights: మళ్లీ వైజాగ్ – విజయవాడ మధ్య విమాన సేవలు

Vizag Vijayawada Flights

Vizag Vijayawada Flights

కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్ మోహన్ నాయుడు (Union Minister Ram Mohan Naidu) గుడ్ న్యూస్ తెలిపారు. విజయవాడ మరియు విశాఖపట్నం మధ్య ఉదయపు విమాన సేవలను (Vizag Vijayawada Flights)మళ్లీ ప్రారభించబోతున్నారు. ఈ విమాన సేవలు జూన్ 1, 2025 నుండి తిరిగి ప్రారంభం కానున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర రాజధానిలో ఒకటైన విజయవాడను ఆర్థిక రాజధాని విశాఖపట్నంతో నేరుగా అనుసంధానించేందుకు ఈ మార్గం కీలకంగా నిలవనుంది.

Earthquake : తెలంగాణలోని పలు ప్రాంతాల్లో స్వల్ప భూకంపం..పరుగులు తీసిన ప్రజలు

ఈ విమాన మార్గాన్ని ఇండిగో ఎయిర్‌లైన్స్ నిర్వహించనుంది. తాజా షెడ్యూల్ ప్రకారం.. విజయవాడ నుండి ఉదయం 7:15 గంటలకు విమానం బయలుదేరి, విశాఖపట్నం కు 8:25 గంటలకు చేరుకుంటుంది. తిరిగి విమానం విశాఖపట్నం నుండి ఉదయం 8:45 గంటలకు బయలుదేరి, 9:50 గంటలకు విజయవాడ చేరుతుంది. ఈ టైమింగ్ తరచుగా ప్రయాణించే ప్రయాణికుల సౌకర్యం దృష్టిలో పెట్టుకొని రూపొందించినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి రామ్ మోహన్ నాయుడు మాట్లాడుతూ.. “ప్రాదేశిక అనుసంధానమే సమగ్ర అభివృద్ధికి మార్గం. విజయవాడ-విశాఖ మధ్య విమాన సేవల పునరుద్ధరణ రాష్ట్ర ప్రయాణికులకు మేలు చేస్తుంది. రెండు నగరాల మధ్య వాణిజ్య, ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడంతో పాటు రాష్ట్రవ్యాప్త అభివృద్ధి లక్ష్యాలకు తోడ్పడుతుంది” అని తెలిపారు.