Hotel Bill: రెస్టారెంట్ లో భోజనం చేసిన విద్యార్థులు.. బిల్ లక్ష.. చివరికి?

మామూలుగా మనం వీకెండ్ సమయంలో లేదా ఇంట్లో ఫుడ్ నచ్చనప్పుడు స్నేహితులతో లేదంటే ఫ్యామిలీతో కలిసి అలా రెస్టారెంట్ కి తినడానికి వెళ్తూ ఉంటాము. కొన

  • Written By:
  • Publish Date - June 5, 2023 / 06:15 PM IST

మామూలుగా మనం వీకెండ్ సమయంలో లేదా ఇంట్లో ఫుడ్ నచ్చనప్పుడు స్నేహితులతో లేదంటే ఫ్యామిలీతో కలిసి అలా రెస్టారెంట్ కి తినడానికి వెళ్తూ ఉంటాము. కొన్ని కొన్ని సార్లు కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు రెస్టారెంట్ ఫుడ్ తినక తప్పదు. ఫ్యామిలీ మెంబర్స్ లేదంటే ఫ్రెండ్స్ కాస్త ఎక్కువగా వెళ్ళినప్పుడు లేదంటే ఎక్కువగా తిన్నప్పుడు బిల్లు కాస్త అటు ఇటు కాస్త ఎక్కువగానే అవుతుంది. మహా అంటే ఐదు వేలు ఇంకా అంటే ఒక పది వేల రూపాయలు అవ్వవచ్చు. అంతకుమించి అంటే కాస్ట్లీ ఐటమ్స్ తీసుకుంటే తప్ప అవ్వదు.

కానీ ఇటలీలో మాత్రం కొందరు స్నేహితులు తినడానికి అని ఒక రెస్టారెంట్ కి చివర్లో బిల్లు చూడగా ఏకంగా లక్ష రావడంతో వారికి దిమ్మతిరిగింది. మరి ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. జపాన్ కి చెందిన నలుగురు స్టూడెంట్స్ టూర్ కోసం ఇటలీకి వెళ్లారు. ఒకరోజు భోజనం కోసం అక్కడ ఒక ప్రముఖ రెస్టారెంట్ కి వెళ్లారు. అక్కడ నలుగురు కలిసి నాలుగు ప్లేట్ల స్లీక్ ఒక వాటర్ బాటిల్, ఫ్రైడ్ షిప్ ఫుడ్స్ ఆర్డర్ చేశారు. స్నేహితులు సంతోషంగా ఆర్డర్ చేసిన ఫుడ్ ని తిన్నారు.

అంతా అయిపోయాక చివర్లో బిల్లును చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. బిల్లులో దాదాపు నలుగురు తిన్న ఫుడ్ కి లక్ష రూపాయలు వేశారు. వారు ఎంత తిన్నారో , బిల్ ఎంత వేశారు అర్థం కాలేదు. దాంతో వెంటనే రెస్టారెంట్ నిర్వాహకులను నిలదీశారు. అయితే రెస్టారెంట్ సిబ్బంది చెప్పిన విషయాన్ని విని ఆ విద్యార్థులు షాక్ అయ్యారు. ఇంటర్నెట్ హాట్స్పాట్ కి ఇతర సౌకర్యాల పేరుతో అదనంగా హిడెన్ చార్జీలు వేసారని తెలుసుకున్నారు. దాంతో బిల్లు చెల్లించక తప్పలేదు. బిల్లు కట్టేసి అక్కడి నుంచి వచ్చిన ఆ విద్యార్థులు అలా చార్జీలు విధించడం కరెక్ట్ కాదని భావించి ఆ విషయంపై న్యాయ పోరాటం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సాక్షాదారాలతో సహా రెస్టారెంట్ ని ఇరికించారు. ఎంతో రెస్టారెంట్ యాజమాన్యం దిగి రావాల్సి వచ్చింది. ఇక రెస్టారెంట్ యాజమాన్యం ఆ నలుగురు విద్యార్థులకు 12.5 లక్షలు పరిహారం ఇచ్చారు. ఇందుకు సంబంధించిన విషయం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆ విద్యార్థులు చేసిన పనికి నెటిజన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.