Site icon HashtagU Telugu

Prashant Kishor Proposal: “72 గంటల్లో నివేదిక” ప్రశాంత్ కిషోర్ ప్రతిపాదనపై కాంగ్రెస్..!!

PK congress

PK congress

ప్రజల విశ్వాసం తిరిగి పొందే విధంగా…కాంగ్రెస్ పార్టీ శరవేగంగా అడుగులు వేస్తోంది. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడంతో పాటుగా…అధికారంలోకి వచ్చేందుకు అవసరమైన అన్ని విషయాలపై హైకమాండ్ కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో గత పది రోజులుగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు వరుసగా భేటీ అవుతున్నారు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పర్యవేక్షణలో బుధవారం కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు అధినేత్రి సోనియా గాంధీ నివాసంలో దాదాపు ఆరు గంటలపాటు ఈ సమావేశం సాగింది. ఈ సమావేశంలో ప్రశాంత్ కిషోర్ తో పాటుగా కాంగ్రెస్ ముఖ్యమంత్రులు, ఇతర కీలక నేతలు పాల్గొన్నారు.

సమావేశం అనంతరం కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రణదీప్ సూర్జేవాలా మీడియాతో మాట్లాడారు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన ప్రతిపాదనలతో పాటుగా…సంస్థాగతంగా, పాలనాపరంగా అనుభవం ఉన్న ఇద్దరు కాంగ్రెస్ సీఎంలు అశోక్ గెహ్లాట్, భూపేశ్ భగేల్ అభిప్రాయాలను తీసుకున్నామని తెలిపారు. వచ్చే 72 గంటల్లో చర్చలు సమాలోచనలు పూర్తిచేసి తుది నివేదిక అందజేస్తామని తెలిపారు. ప్రజల ఆశలు, అభిప్రాయాలను పరిగణలోకి తీసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తున్నట్లు వివరించారు.

అయితే ఎన్నికల వ్యూహ కర్తగా ప్రశాంత్ కిషోర్ కు మంచి పట్టుదని తెలిసినప్పటికీ..కాంగ్రెస్ ఆచరణాత్మకంగానే ముందుకు వెళ్తోంది. సోనియాగాంధీ అంగీకారం తెలిపినప్పటికీ..కాంగ్రెస్ సమిష్టి నిర్ణయం తీసుకోవాలని కోరకుంటోంది. అందరి అభిప్రాయాలను తీసుకుని, కాంగ్రెస్ పార్టీ కొత్త రూపు సంతరించుకునే విధంగా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. అయితే మొదట్లో చాలా మంది కాంగ్రెస్ అగ్రనేతలు ప్రశాంత్ కిషోర్ ప్రతిపాదనలను తిరస్కరించారు. ఇది గుజరాత్ కు ఎన్నికలకు సంబంధించిన ప్రతిపాదన మాత్రమే అన్నారు. పార్టీ లోకి ప్రశాంత్ కిషోర్ వస్తే అగ్రనేతలకు ప్రాధాన్యం తగ్గిపోతుంది. పీకే సలహాలతోనే పార్టీని నడుపుతారు. అందుకే సీనియర్లు ఎక్కువమంది ప్రశాంత్ కిషోర్ రాకను వ్యతిరేకిస్తున్నారు. అయితే పీకేకు పార్టీలో ఎంత ప్రాధాన్యం ఇస్తారన్నదాన్ని స్పష్టంగా చెప్పిన తర్వాత ఆయన్ను పార్టీలోకి తీసుకోవాలని భావిస్తున్నారు.

Exit mobile version