Site icon HashtagU Telugu

Khammam: ఖమ్మం పార్లమెంట్ స్థానంపై రేణుక గురి

Renuka Fire

Renuka Fire

Khammam: త్వరలో పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రధాన పార్టీలకు ఇప్పట్నుంచే తలనొప్పులు మొదలవుతున్నాయి. ప్రధాన పార్టీలు అయినా బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ఈసారి అభ్యర్థుల ఎంపిక కష్టంగా మారే అవకాశం ఉంది. అసెంబ్లీ టికెట్ రానివాళ్లు పార్లమెంట్ టికెట్ ఆశించే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకా చౌదరి ఖమ్మం గురి పెట్టారు.

ఖమ్మం టిక్కెట్టుకు కాంగ్రెస్ పార్టీలో ఎవరూ నో చెప్పరని రేణుకా చౌదరి విశ్వాసం వ్యక్తం చేశారు. ఖమ్మం నుంచి పోటీ చేయాలని ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీని మనస్ఫూర్తిగా కోరినట్లు ఆమె తెలిపారు. సోనియా తెలంగాణ నుంచి పోటీ చేస్తే చాలా శుభపరిణామం. ప్రస్తుతం ఖమ్మం లోక్‌సభ స్థానం సోనియాగాంధీకి రిజర్వ్‌ అయిందని, మిగిలినది ఆమె నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని ఆమె అన్నారు.

ఖమ్మం నుంచి పోటీ చేసే విషయంలో ఎవరు ఎన్ని ప్రచారాలు చేసినా పట్టించుకోలేదని ఆమె కొట్టిపారేశారు. మరో 20 ఏళ్లు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. తాను కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు జిల్లాలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానని, ఎస్సీ, ఎస్టీ వర్గాలను కూడా ఢిల్లీకి తీసుకెళ్లానని ఆమె తెలిపారు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అక్రమాలపై కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వీరోచితంగా పోరాడుతున్నారని కొనియాడారు. అయితే ఖమ్మం బరిలో చాలామంది నేతలు ఆశలు పెట్టుకున్నారు. చివరకు భట్టి భార్య కూడా రేసులో నిలిచి ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.

Exit mobile version