Site icon HashtagU Telugu

AP : ‘తండ్రి’ శవం వద్ద సంతకాల కోసం ట్రై చేసిన ‘స్కిల్’ జగన్ మోహన్ రెడ్డిది – రేణుకా చౌదరి

Renuka Chowdhury Comments On CM Jagan Over Chandrababu Arrest

Renuka Chowdhury Comments On CM Jagan Over Chandrababu Arrest

అక్రమ కేసులో చంద్రబాబు (Chandrababu) ను జైలు పాలుచేయడం ఫై యావత్ తెలుగు ప్రజానీకం ఆగ్రహంతో ఊగిపోతోంది. 40 ఏళ్ల రాజకీయ చరిత్ర..అవినీతి మచ్చ లేని వ్యక్తి..ప్రజల శ్రేయస్సు…రాష్ట్ర అభివృద్దే లక్ష్యంగా పెట్టుకొని రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు ఫై అక్రమ కేసు పెట్టి జైల్లో వేస్తారా అంటూ అన్ని రాజకీయ పార్టీల నేతలు , సినీ ప్రముఖులు , ఐటీ ఉద్యోగులు , ఇతర రంగాలకు చెందిన వారు ముక్తకంఠంతో వైసీపీ సర్కార్ (YCP Govt) ఫై నిప్పులు చెరుగుతున్నారు. మరోపక్క తెలంగాణ లోని నేతలు సైతం చంద్రబాబు అరెస్ట్ ఫై స్పందిస్తున్నారు.

రీసెంట్ గా సీనియర్ రాజకీయ నేత , చంద్రబాబు (Chandrababu)కు ఆప్తుడు తుమ్మల నాగేశ్వర్ రావు సైతం చంద్రబాబు అరెస్ట్ ఫై తన స్పందనను తెలియజేయగా..తాజాగా కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ , మాజీ కేంద్రమంత్రి రేణుకా చౌదరి (Renuka Chowdhury) జగన్ ఫై నిప్పులు చెరిగారు. మోసాలు చేయడానికి, బాబాయ్ ని చంపుకోవడంలోనూ, తండ్రి శవం వద్ద సంతకాల కోసం ప్రయత్నించడంలోనూ జగన్ ‘స్కిల్’ అనేది అందరికీ తెలిసిందేనని సెటైర్లు వేశారు. జగన్ ఒక మూర్ఖుడిగా, మానసిక రోగిగా అభివర్ణించారు. అధికార దాహంతో జగన్ రొప్పుతున్నాడని, అతి త్వరలో అతడి మదం తగ్గుతుందని రేణుకా చౌదరి వ్యాఖ్యానించారు.

“ఇక ఆ సీఐడీ పోలీస్ సంస్థ ఏంటండీ … ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా, ఎలాంటి లోపాలు లేకుండా అరెస్ట్ చేస్తారా? అని ప్రశ్నించారు. ఇదే సందర్బంగా జగన్ ఒక మెంటల్ కేసు అంటూ ఫైర్ అయ్యారు. రాజ్యాంగంలో ఒక మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ప్రతి ఐదేళ్లకు ఇలాంటి నాయకులకు మానసిక వైద్య పరీక్షలు చేసి, మానసికంగా సరిగ్గా ఉన్నారా లేదా అనేది నిర్ధారించాలి. ఇంతవరకు ఒక్క రాజధానే రాలేదు కానీ, మూడు రాజధానులు అని మాట్లాడిన మూర్ఖుడు జగన్. ఒక మాజీ ముఖ్యమంత్రితో వ్యవహరించే తీరు ఇలాగేనా?” అంటూ రేణుకా చౌదరి మండిపడ్డారు.

Read Also : CBN Jail : ఏపీ కోర్టుల్లో చెల్ల‌ని`లూథ్రా`! జైలులో బాబుకు `క‌త్తి` క‌థ !!

రేణుక (Renuka Chowdhury) స్పందన ఇలా ఉంటె..చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ.. హైదరాబాద్​లోని ఐటీ ఉద్యోగులు రోడ్ల పైకి వచ్చి ఆందోళన చేసారు. విప్రో సర్కిల్​ వద్ద మానవహారం నిర్వహించారు. రాజకీయ కక్షతోనే మాజీ సీఎంను చంద్రబాబు ను అరెస్టు చేశారని.. ఏపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.