Site icon HashtagU Telugu

Renuka Chowdhury: రేవ్ పార్టీ పై రేణుక చౌదరి క్లారిటీ

Renuka Chowdhury

Renuka Chowdhury

రాడిసన్ బ్లూ హోటల్ రేవ్ పార్టీపై కేంద్ర మాజీ మంత్రి రేణుక చౌదరి స్పందించారు. ఆ పబ్ రేణుక చౌదరి కుమార్తె ది అని వస్తున్న వార్తలపై స్పందించిన రేణుక చౌదరి తన కుమార్తె తేజస్విని చౌదరిపై వార్త సంస్థలలో వచ్చిన వార్తలను తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. రాడిసన్ బ్లూ హోటల్‌లో ఉన్న బార్, పుడ్డింగ్ మరియు మింక్‌పై పోలీసుల దాడికి సంబంధించి తన కుమార్తె పై వచ్చిన ఆరోపణలు అన్ని పూర్తిగా అవాస్తవమని, పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారని వచ్చిన ప్రసారాలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాని తెలిపిన ఆమె కొన్ని మీడియా సంస్థలలో తన కుమార్తెపై తప్పుడు వార్తలు ప్రసారం అయ్యాయని పేర్కొన్నారు.

తన కుమార్తె పుడ్డింగ్ మరియు మింక్‌ల యజమాని కాదని, దాని నిర్వహణలో ఆమె పాలుపంచుకోలేదని తాను ఖచ్చితంగా ప్రకటిస్తున్నానని రేణుక చౌదరి తెలిపారు. తన కుమార్తె ఏప్రిల్ 2,2022న పుడ్డింగ్ మరియు మింక్ వద్ద లేదని, పోలీసుల రైడ్‌లో భాగంగా పోలీసులు తన కుమార్తెను అదుపులోకి తీసుకోలేదని, ప్రశ్నించలేదని అల వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని ప్రకటించారు.

సెన్సేషనల్ రిపోర్టింగ్‌లో ప్రైవేట్ వ్యక్తుల పేర్లను ప్రస్తావించి, లాగడానికి ముందు గౌరవప్రదమైన మీడియా సంస్థలు ప్రాథమిక పాత్రికేయ ప్రమాణాలను పాటించాలని సూచించిన రేణుక చౌదరి వాస్తవాలను నిర్దారించుకొని ప్రసారం చేయాలని ఆశిస్తున్నట్లు తెలిపింది.