Site icon HashtagU Telugu

Renudesai: పవన్ కళ్యాణ్ అభిమానిపై రేణుదేశాయ్ ఫైర్!

Renu Desai is suffering from heart problem

Renu

2012లో పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ విడాకులు తీసుకుని విడిపోయారు. అప్పటినుంచి రేణు దేశాయ్ సింగిల్ గానే ఉంటోంది. కొంతకాలం పిల్లలతో కలిసి రేణు పూణేలో ఉన్నది. ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉంటోంది. అయితే ఇటీవల అకీరా బర్త్ డే. ఈ సందర్భంగా మెగా హీరోలతో పాటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అకీరాకు సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ తెలిపారు. ఈ సందర్భంగా ఓ పవన్ కళ్యాణ్ అభిమాని హద్దు మీరి పెట్టిన మెసేజ్ కు రేణు దేశాయ్ గట్టిగా రిప్ల‌య్ ఇచ్చింది. 11 ఏళ్లుగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నన్ను ఒక చెడ్డదానిలా, విలన్ లా చూస్తున్నారని.. ఇదంతా చూసి తాను విసిగిపోయానంటూ.. ఎమోషనల్ అయ్యింది.

అకీరా బర్త్ డే సందర్భంగా ఓ పవన్ కళ్యాణ్ అభిమాని ..’మేడం ఇది చాలా అన్యాయం. మా అకీరాను ఒక్కసారి అయినా చూపించండి. మా అన్న (పవన్ కళ్యాణ్) కొడుకును చూడాలని మాకు ఉంటుంది. మీరు హైడ్ చేయకండి. అప్పుడప్పుడు వీడియోలలో అయినా అకీరాను చూపించండి’ అని రేణుకు మెసేజ్ చేశాడు. దీనిపై రేణుక దేశాయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సదరు అభిమానికి ఘాటుగా రిప్ల‌య్‌ ఇచ్చింది. ‘ మీ అన్న కొడుకా?? అకీరా నా కొడుకు. మీరు ఒక తల్లికి పుట్టలేదా. మీరు హార్డ్ కోర్ ఫ్యాన్స్ అని నేను అర్థం చేసుకోగలను. కానీ, కొంచెం మాట్లాడే పద్ధతి నేర్చుకోండి అంటూ కౌంటర్ ఇచ్చింది.