Site icon HashtagU Telugu

Zakir Hussain Passes Away: వాహ్ తాజ్.. తబలా వాద్యకారుడు జాకీర్ హుస్సేన్ క‌న్నుమూత‌

Zakir Hussain Passes Away

Zakir Hussain Passes Away

Zakir Hussain Passes Away: భారతీయ సంగీత పరిశ్రమ నేడు పెద్ద షాక్‌కు గురైంది. ప్రముఖ తబలా వాద్యకారుడు జాకీర్ హుస్సేన్ (Zakir Hussain Passes Away) కన్నుమూశారు. 73 ఏళ్ల వయసులో ప్రపంచానికి వీడ్కోలు పలికారు. ఇటీవల జకీర్ అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. గుండె సంబంధిత సమస్యల కారణంగా అతను ఆసుపత్రిలో చేరాడు. ఆదివారం ఆయ‌న మృతిచెందిన‌ట్లు తెలుస్తోంది.

ప్రముఖ సంగీత విద్వాంసుడు జాకీర్ హుస్సేన్(73) కన్నుమూశారు. కొంత కాలంగా గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న జాకీర్ హుస్సేన్.. అమెరికాలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తబలా ప్లేయర్ జాకీర్ హుస్సేన్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు కొన్ని గంట‌ల క్రితం వార్తలు వచ్చాయి. అతను కోలుకోవాలని ప్రార్థించమని అతని కుటుంబం ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ఇంత‌లోనే జాకీర్‌ హుస్సేన్‌ మృతి పట్ల అందరూ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు. సోషల్ మీడియాలో ఆయనకు జనం భావోద్వేగంతో నివాళులు అర్పిస్తున్నారు.

Also Read: Bastar Story 2024: జయమతి అండ్ సుశీల.. నాడు మావోయిస్టులు.. నేడు భద్రతా సిబ్బంది

జాకీర్ హుస్సేన్‌కు 1988లో పద్మశ్రీ, 2002లో పద్మభూషణ్, 2023లో పద్మవిభూషణ్ అవార్డులు అందుకున్నారు. అతను సంగీతానికి అత్యంత ప్రతిష్టాత్మకమైన గ్రామీ అవార్డును ఐదుసార్లు అందుకున్నాడు. కేవలం 11 సంవత్సరాల వయస్సులో జాకీర్ తన మొదటి సంగీత కచేరీని అమెరికాలో చేసాడు. జాకీర్ హుస్సేన్ 1989లో హీట్ అండ్ డస్ట్ సినిమాతో తన సినీ జీవితాన్ని ప్రారంభించాడు. ఈ సినిమాలో నటనతో పాటు సంగీతాన్ని కూడా సమకూర్చాడు. ఆల్-స్టార్ గ్లోబల్ కాన్సర్ట్‌లో పాల్గొనేందుకు 2016లో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా వైట్‌హౌస్‌కి ఆహ్వానించిన తొలి భారతీయ సంగీతకారుడు కూడా ఇతను.

1990లో ‘తాజ్ మహల్’ టీ ప్రకటనను ఎవరు మర్చిపోగలరు? ఇందులో జాకీర్ సాహెబ్ అద్భుతమైన తబలా వాయించడం ఇప్పటికీ ప్రజలకు గుర్తుండే ఉంటుంది. ఇందులో వాహ్ తాజ్ అంటూ ఆయన తీరు జనాలకు బాగా నచ్చింది.