Vaddiraju: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రాజముద్ర నుండి కాకతీయ కళా తోరణాన్ని తొలగించడం చాలా బాధాకరమని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. ఇప్పటికే మన చరిత్ర మరుగున పడుతుంది అనే దానిని ఇంకా కనుమరుగు చేయాలి అనుకోవడం సరికాదు. కాకతీయులు అనుసరించిన పాలన విధానం గొలుసుకట్టు చెరువులు , ప్రతి గ్రామంలో దేవాలయాలు నిర్మించడం , వారు గ్రామాలలో అభివృద్ధి చేసి వ్యవసాయ విధానం పైనా వారు అందించిన సుపరిపాలన ఆదర్శనీయం. ప్రపంచ దేశాలు తమ యొక్క చరిత్రని వెలికితీయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంటే మనం మాత్రం ఉన్న చరిత్రని కనపడకుండా చేస్తున్నాం’’ అని అన్నారు.
‘‘మన కాకతీయ చరిత్ర గురించి ఇతర రాష్ట్రాలు , ఇతర దేశాలు గొప్పగా చెప్పుకుంటుంటే మనం మాత్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఇటలీ యాత్రికుడు అయిన మార్కోపోలో మన కాకతీయ పాలన గురించి తన గ్రంథంలో పొందుపరిచిన చరిత్ర మనది అలాంటి చరిత్రని కాంగ్రెస్ ప్రభుత్వం అణచివేయడం చాల బాధాకరం. ఇది ఓరుగల్లు ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా లోగో మార్పు చేయడం తెలంగాణ ఉద్యమనేతగా ఖండిస్తున్నాను ఇది చాలా బాధాకరం. ఈ విధమైన ఆత్మగౌరవమైన అనైతిక చర్యలకు పాల్పడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వ మొండి వైఖరిని నిరసిస్తూ.. ఖండిస్తున్నాను’’ అని పేర్కొన్నారు.