Site icon HashtagU Telugu

Uttarakhand: ‘ధర్మ సంసద్‌’లో మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ప్రసంగాలు

Template (56) Copy

Template (56) Copy

ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో నిర్వహించిన ‘ధర్మ సంసద్‌’లో మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేశారు. ఈ నెల 17 నుంచి19 వరకూ మూడు రోజుల పాటు జరిగిన ఈ సభల్లో పలు హిందూ సంస్థల ప్రతినిధులు చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. హిందువులంతా ఆయుధాలు చేపట్టి, ముస్లింలపై యుద్ధానికి సిద్ధం కావాలని సభ పిలుపునిచ్చింది.

https://twitter.com/zoo_bear/status/1473581283242491904

సభకు నేతృత్వం వహించిన యతి నరసింహానంద మాట్లాడుతూ, ‘‘2029లో ఒక ముస్లిం దేశానికి ప్రధాని అవుతాడు. దేశంలో ముస్లిం జనాభా పెరుగుతుండగా, హిందువుల సంఖ్య మాత్రం క్రమంగా తగ్గిపోతోంది. మరో ఏడెనిమిదేళ్లలో రోడ్లపై ముస్లింలు మాత్రమే కనిపించే స్థాయిలో మార్పులు వస్తాయి’’ అని చెప్పారు. హిందువులంతా లక్ష రూపాయల విలువైన ఆయుధాలు కొనుగోలు చేసి సిద్ధంగా ఉంచుకోవాలని రూర్కీకి చెందిన సాగర్‌ సింధూరాజ్‌ మహరాజ్‌ సూచించారు. గతంలో కూడా ఇలాంటి విద్వేషపూరితమైన, అర్థం లేని వ్యాఖ్యలు చేయడం అమాయక ప్రజలను రెచ్చగొట్టడం జరిగింది. యూపీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇలాంటి వ్యాఖ్యలు ఎక్కువైపోతున్నాయి. ప్రభుత్వాలు కూడా ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంతో ఇంకా రెచ్చిపోతున్నారు.

Exit mobile version