Site icon HashtagU Telugu

SRH :సన్ రైజర్స్ కు గుడ్ న్యూస్

Sean Imresizer

Sean Imresizer

ఐపీఎల్ 2022 సీజన్‌లో వరుస విజయాలతో ఆనందంలో ముగినిపోయిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు మరో గుడ్ న్యూస్ అందింది. ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ సీన్ అబాట్ తాజాగా హైదరాబాద్ జట్టుతో చేరాడు. ఈ క్రమంలోనే మూడు రోజుల క్వారంటైన్ ను ముగించుకొని జట్టుతో కలిసి ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం తన అధికారిక ట్విట్టర్‌ అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఇక ఐపీఎల్ 2022 సీజన్ మెగావేలంలో సీన్ అబాట్ ను రూ. 2.40 కోట్ల రూపాయలకు కావ్యా మారన్ ఏరికోరి కొనుగోలుచేసిన సంగతి తెలిసిందే. 2014లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన సీన్ అబాట్ ఆస్ట్రేలియా 5 వన్డేలు, 8 టి20లు ఆడాడు. ఐపీఎల్‌లో ఇప్పటివరకు 2 మ్యాచ్‌ల్లో పాల్గొన్నాడు.

ఇక ఐపీఎల్ 15వ సీజన్ లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ తన తదుపరి మ్యాచ్‌ను శుక్రవారం కోల్‌కత నైట్‌రైడర్స్‌తో ఆడనుంది. ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో ఈ మ్యాచ్ సాయంత్రం 7:30 గంటలకు జరగనుండగా.. ఈ మ్యాచ్‌లో సీన్ అబాట్ తుది జట్టులో చోటు దక్కించుకునే అవకాశముంది… మరో ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయం కారణంగా దూరమవడం వల్ల సీన్ అబాట్‌ను సన్ రైజర్స్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్ ఆల్ రౌండర్ గా బరిలోకి దించనుంది.. ఇక అంతకుముందు సోమవారం గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్ లో వాషింగ్టన్‌ సుందర్‌ గాయపడ్డాడు. ఈ మ్యాచ్ లో 3 ఓవర్లు వేసి కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చిన సుందర్ చేతికి అయిన గాయం కారణంగా తన బౌలింగ్‌ కోటా పూర్తిచేయలేకపోయాడు. వాషింగ్టన్‌ సుందర్‌ గాయం కారణంగా మరికొన్ని మ్యాచ్‌లకు దూరం కానున్నట్లు సమాచారం.. ఇక చెన్నై సూపర్‌కింగ్స్‌పై గెలుపుతో ఐపీఎల్‌-2022లో బోణీ కొట్టిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. గుజరాత్‌పై 8 వికెట్ల తేడాతో గెలుపొంది రెండో విజయం అందుకుంది.