Site icon HashtagU Telugu

Corona: పిల్లల టీకా- రిజిస్ట్రేషన్ ప్రారంభం

File Photo

దేశంలో 15-18 ఏళ్ల వయసులోపు పిల్లలకు కొవిడ్‌ టీకా పంపిణీకి రిజిస్ట్రేషన్​ ప్రక్రియ ప్రారంభమైంది. టీకా వేయించుకోవాలనుకునే పిల్లల పేర్లను కొవిన్​ యాప్​లో నమోదు చేయాలని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్​సుఖ్ మాండవీయ తెలిపారు. రెజిస్ట్రేషన్ చేసుకున్నవారికి జనవరి 3 నుంచి పిల్లలకు వ్యాక్సిన్ వేయనున్నారు.

దేశంలో 15-18 ఏళ్ల వయసు వారికి కొవిడ్‌ టీకా పంపిణీ కార్యక్రమాన్ని జనవరి 3న ప్రారంభించనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ గతవారం తెలిపిన విషయం తెలిసిందే. 60 ఏళ్ల వయసు దాటి, ఇతరత్రా ఆరోగ్య సమస్యలున్నవారికి, ఆరోగ్య విభాగ సిబ్బందికి ‘ముందు జాగ్రత్త (ప్రికాషన్‌) డోసు’ జనవరి 10 నుంచి అందించనున్నామని కేంద్ర మంత్రి తెలిపారు.