Danam Nagendar: దానంపై కేసు నమోదు..రేవంత్ దృష్టికి తీసుకెళ్తా..!

హైదరాబాద్‌లో ఖైరతాబాద్ ఎమ్మెల్యే మరియు కాంగ్రెస్ నేత దానం నాగేందర్‌పై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఆయనపై ఫిర్యాదు నమోదైంది.

Published By: HashtagU Telugu Desk
Casae Filed On Danam

Casae Filed On Danam

Case Filed On Mla Danam: హైదరాబాద్‌లో ఖైరతాబాద్ ఎమ్మెల్యే మరియు కాంగ్రెస్ నేత దానం నాగేందర్‌పై (Mla Danam) పోలీస్ స్టేషన్ లో కేసు (Case) నమోదైంది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో (Jubli Hills Ps) ఆయనపై ఫిర్యాదు నమోదైంది. ఈ కేసు, ఆక్రమణదారులను కావాలని రెచ్చగొట్టినట్లు ఆయనపై ఆరోపణలపై ఆధారితంగా ఉంది.

గత శనివారం, జూబ్లీహిల్స్ డివిజన్‌లోని నందగిరిహిల్స్ గురుబ్రహ్మనగర్ ప్రాంతంలో స్థానికులను రెచ్చగొట్టడం జరిగిందని, దీంతో వారు పార్క్ గోడను (Wall ) కూలగొట్టారు. ఈ విషయాన్ని జీహెచ్ఎంసీ అధికారులు (Ghmc Officials) దానం నాగేందర్‌పై పోలీసులకు ఫిర్యాదు (Complaint) చేశారు. ఫిర్యాదులో, ఎమ్మెల్యేతో పాటు ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో, దానం నాగేందర్ మరియు మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ప్రహరీ గోడ కూల్చివేత, తనపై నమోదైన కేసు అంశంపై అధికారులకు ప్రివిలైజ్ నోటీస్ (Privilege Notice) ఇస్తానని వెల్లడించారు. అలాగే ఈ విషయాన్ని తాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) దృష్టికి తీసుకు వెళ్తానన్నారు.  ప్రహరీ గోడ కూల్చివేసిన ఘటనకు సంబంధించి తనపై పోలీసులు కేసు నమోదు చేశారని తెలిపారు.

జూబ్లీహిల్స్ డివిజన్‌లోని నందగిరిహిల్స్‌లో (Nandi Nagar Hills) ప్రజలకు ఇబ్బంది కలుగుతున్న విషయం తెలిసి తాను అక్కడకు వెళ్లానన్నారు. తాను ప్రజాప్రతినిధిగా అక్కడకు వెళ్లానని… తనను అడ్డుకునే అధికారం ఏ అధికారికీ లేదన్నారు. ప్రజాప్రతినిధిగా ప్రజల సమస్యలు తీర్చడమే తన బాధ్యత అన్నారు. కేసులు తనకు కొత్తేమీ కాదన్నారు.

  Last Updated: 13 Aug 2024, 01:15 PM IST