Site icon HashtagU Telugu

Delhi Crime: సిగరెట్‌ కాల్చేందుకు అగ్గిపెట్టె నిరాకరించిన యువకుడు హత్య

Delhi Crime

Delhi Crime

Delhi Crime: ప్రాణానికి విలువ లేకుండా పోతుంది. చిన్న చిన్న వాటికి ప్రాణాలు తీసేస్తున్నారు కొందరు దుర్మార్గులు. తాజాగా ఢిల్లీలో సిగరెట్‌ కాల్చేందుకు అగ్గిపెట్టె నిరాకరించిన యువకుడిని హత్య చేయడం కలకలం రేపుతోంది. ఢిల్లీలోని తిమార్‌పూర్ ప్రాంతంలో సిగరెట్ కాల్చేందుకు అగ్గిపెట్టె ఇవ్వడానికి నిరాకరించినందుకు ఓ యువకుడిని ఇద్దరు యువకులు కత్తితో పొడిచి అతి కిరాతకంగా హత్య చేశారు.

ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు నిందితులిద్దరినీ పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. అంతకుముందు ప్రత్యక్ష సాక్షి వాంగ్మూలాన్ని నమోదు చేశామని తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిమార్‌పూర్‌ పోలీస్‌ స్టేషన్‌కి కత్తిపోటు ఘటనకు సంబంధించి పీసీఆర్‌ కాల్‌ వచ్చింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రక్తపు మడుగులో ఉన్న యువకుడిని హిందూరావు ఆసుపత్రికి తరలించామని తెలిపారు డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ ఎంకే మీనా. అయితే ఆసుపత్రికి చేరుకోగానే యువకుడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారని డీసీపీ తెలిపారు.

We’re now on WhatsAppClick to Join

నిందితుల నుంచి హత్య చేయడానికి ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. డిసిపి మాట్లాడుతూ.. సిగరెట్ కాల్చడానికి అగ్గిపెట్టె ఇవ్వాలని ఇద్దరు యువకులు మరో యువకుడిని అడిగారు. అయితే అతను అందుకు నిరాకరించాడని, దీంతో ఇరువురి మధ్య మాటల వాగ్వాదానికి దారితీసిందని వెల్లడించారు. వాగ్వాదం పెరగడంతో యువకులలో ఒకరు బాధితుడిపై కత్తితో దాడి చేసి ఆ ఇద్దరూ అక్కడి నుంచి పారిపోయారని డీసీపీ తెలిపారు. కాగా పట్టుబడిన నేరస్థుల్లో ఒకరు గతంలో మరో దారుణమైన నేరానికి పాల్పడ్డారని తెలిపారు.

Also Read: Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కోణం.. మహిళలపై కానిస్టేబుల్ లైంగిక దాడులు