Sodium: ‘ఉప్పు’ ఆరోగ్యానికి ముప్పు!

ఉప్పు ఎంత తక్కువగా తీసుకుంటే అంత మంచిది. ఉప్పుతో లాభాల కంటే నష్టాలే ఎక్కువగా ఉన్నాయి.

  • Written By:
  • Updated On - April 5, 2022 / 03:58 PM IST

ఉప్పు ఎంత తక్కువగా తీసుకుంటే అంత మంచిది. ఉప్పుతో లాభాల కంటే నష్టాలే ఎక్కువగా ఉన్నాయి. అధికంగా ఉప్పును తినేవారికి ఎన్నో అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందట. మరీ ముఖ్యంగా గుండె జబ్బులతో బాధపడేవారు..గుండె వైఫల్యం బాధితులు.. ఉప్పును తక్కువగా తీసుకోవడం వల్ల వచ్చే లాభాలపై పరిశోధకులు ఒక అధ్యయనం నిర్వహించారు. దీని ఫలితాలు ప్రముక హెల్త్ జనరల్ లాన్సెట్ లో ప్రచురితం అయ్యాయి. ఉప్పును తగ్గిస్తే..ఆసుపత్రుల్లో అత్యవసరంగా చేరాల్సి రావడం…మరణాలు ముప్పు అయితే అంతగా తగ్గలేదు. కానీ ఉప్పును తగ్గించినట్లయితే గుండె సమస్యలున్నవారు..రోజువారీ జీవనం మెరుగుపడినట్లు తెలిపింది. వాపు, అలసట, దగ్గు నుంచి వారికి ఉపశమనం లభించినట్లు పరిశోధకులు గుర్తించారు.

మొత్తానికి లైఫ్ స్టైల్ మెరుగుపడిందని తెలిసింది. కెనడా, అమెరికా, కొలంబియా, చిలే, మెక్సికో, న్యూజిలాండ్ లోని 26 వైద్య కేంద్రాల్లో 806 మంది రోగులపై ఈ అధ్యయనం నిర్వహించారు. 806 మంది కూడా గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న రోగులే ఉన్నారు. ఈ స్థితిలో రక్తాన్ని గుండె సమర్థవంతంగా పంప్ చేయలేదని గుర్తించారు. అదే సమయంలో ఉప్పు మోతాదుకు మించి ఎక్కువగా తీసుకున్నట్లయితే శరీరంలో నీరు నిలిచేలా చేస్తుంది. ఇదే కాళ్లు, ముఖంపై వాపు రావడానికి దారితీస్తుంది. ఈ రోగులు రెండు గ్రూపులుగా చేశారు. ఒక గ్రూపులోని రోగులు పోషకాహార నిపుణుల సూచనల మేరకు బయట ఆహారానికి దూరంగా ఉన్నారు. ఇంట్లోనే ఉప్పు లేకుండా వంటలు చేసుకున్నారు. ఉప్పు ఎక్కువగా ఉండే పదార్థాలకు దూరంగా ఉన్నారు. మరొక గ్రూపులోని వారు రోజు వలే ఆహారం తీసుకోవాలని సూచించారు.

గ్రూపులోని రోగులు ప్రతిరోజూ 1,658మిల్లీ గ్రాముల ఉప్పును మించకుండా చర్యలు తీసుకున్నారు. మరో గ్రూపులోని వారు 2,072 మిల్లీగ్రాముల ఉప్పు తీసుకునేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ రెండు గ్రూపుల్లోని వారు అత్యవసరంగా హాస్పిటల్స్ తో చేరాల్సి రావడం…ఏదైనా కారణంతో మరణించడం వంటి వాటిల్లో పెద్ద వ్యత్యాసం కనిపించలేదు. అయినప్పటికి ఉప్పు తగ్గించడం వల్ల జీవన నాణ్యత మెరుగుపడిట్లు తేలింది. ఈ పరిశోధనల్లో పాల్గొన్న కార్డియాలజిస్ట్, ఎజెకోవిట్జ్ మాట్లాడుతూ..రోగులకు ఆహార పరమైన మార్పులను సూచించడం ఉపయోగకరమన్నది డాక్టర్లు గుర్తించాలని చెప్పారు.