Vehicle Sale: తగ్గిన మారుతి, హ్యాందాయ్ విక్రయాలు..ఆశాజనకంగా టాటా…!!!

భారత్ లోని వాహన తయారీదారు సంస్థలు ఫిబ్రవరి 2022నెల విక్రయాల జాబితాను విడుదల చేసింది. సెమీ కండక్టర్ చిప్ ల కొరత వల్ల చాలా కంపెనీలు ప్రతికూల విక్రయాలను నివేదించారు.

  • Written By:
  • Publish Date - March 3, 2022 / 01:02 PM IST

భారత్ లోని వాహన తయారీదారు సంస్థలు ఫిబ్రవరి 2022నెల విక్రయాల జాబితాను విడుదల చేసింది. సెమీ కండక్టర్ చిప్ ల కొరత వల్ల చాలా కంపెనీలు ప్రతికూల విక్రయాలను నివేదించారు. అయినప్పటికీ ఫిబ్రవరి 2022నెలలో కొన్ని బ్రాండ్ లు సానుకూల అమ్మకాల వ్రుద్ధి నమోదు చేశాయి. ఏయో కంపెనీలు ఎంత వ్రుద్ధిని సాధించాయో తెలుసుకుందాం.

మారుతీ సుజుకి…
దేశంలోనే అతిపెద్ద ప్యాసింజర్ కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకి ఇండియా ఫిబ్రవరిలో మొత్తం టోకు విక్రయాలు, 1,64,056 యూనిట్లు తగ్గింది. ఫిబ్రవరి 2021లో కంపెనీ 1,64,469 యూనిట్లను విక్రయించినట్లుగా ఎంఎస్ఐ రెగ్యులేటరీ ఫైలింగ్ లో పేర్కొంది. ఫిబ్రవరి 2021లో 1,52, 983 యూనిట్ల నుంచి పోయిన నెలలో కంపెనీ దేశీయ విక్రయాలు 8.46శాతం తగ్గి…1,40,035 యూనిట్లకు పడిపోయిందని తెలిపింది.

సెమికండక్టర్ కొరత కారణంగా మారుతి సుజుకీ అమ్మకాలు ఫిబ్రవరి నెలలో తగ్గాయి. ఈ క్రమంలోనే వాహనాల ప్రొడక్టును కూడా మారుతి తగ్గించింది. ఫిబ్రవరి నెల మొత్తం అమ్మకాలు ఏడాది ప్రాతిపదికన 1,64,056 యూనిట్ల నుంచి 1,64, 469యూనిట్లకు తగ్గాయి.

టాటా మోటార్స్….
టాటా మోటార్స్ ఈ సంవత్సరానికి అమ్మకాలు దాదాపు 26.89శాతం వ్రుద్ది రేటును నమోదు చేసింది. ఫిబ్రవరిలో 222లో 77,733 యూనిట్లు విక్రయించగా…గతేడాది ఇదే నెలలో 61,258 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఫిబ్రవరిలో 2021లో కంపెనీ 58,366యూనిట్లను పంపింది. దేశీయ విపణీలో తమ ప్యాసింజర్ వెహికల్స్ విక్రయాలు గతేడాది ఈ నెలలో 27,225 యూనిట్ల నుంచి 47శాతం పెరిగి 39, 981యూనిట్లకు చేరుకున్నట్లు ఆటో మేజర్ తెలిపింది.

14 శాతం తగ్గిన హ్యుందాయ్ విక్రయాలు..
హ్యుందాయ్ మోటార్స్ ఇండియా విక్రయాలు ఫిబ్రవరిలో క్షీణించాయి. ఫిబ్రవరిలో హ్యుందాయ్ మొత్తం విక్రయాలు 14శాతం క్షీణించాయి. 53,159 యూనిట్లకు చేరుకున్నాయి. గతేడాది ఇదే నెలలో కంపెనీ 61,800యూనిట్లను విక్రయించినట్లు హ్యుందాయ్ మోటార్ ఓ ప్రకటనలో తెలిపింది.