Redmi 10 Launch: మీకు బడ్జెట్ ఫోన్ కావాలా..? రెడ్‌మీ 10 బెస్ట్ ఆప్షన్..!!

  • Written By:
  • Updated On - March 18, 2022 / 11:59 AM IST

ప్రముఖ మొబైల్ తయారుదారీ సంస్థ అయిన రెడ్‌మీ 10 స్మార్ట్ ఫోన్ న మన దేశంలో విడుదల చేసింది. గతంలో లాంచ్ చేసిన రెడ్‌మీ 9 స్మార్ట్ ఫోన్ తర్వాత వెర్షన్ గా ఈ ఫోన్ను మార్కెట్లోకి విడుదల చేసింది రెడ్‌మీ. వాటర్ డ్రాప్ నాచ్ తరహా డిస్ ప్లేను ఈ స్మార్ట్ ఫోన్ లో అందించారు. క్వాల్కం స్నాప్ డ్రాగన్ 680 ప్రాసెసర్ పై ఈ ఫోన్ రన్ అవుతుంది. రియల్ మీ సీ 35, మోటోరోలా ఈ 40, టెక్నో స్పార్క్ 8 ప్రో, శాంసంగ్ గెలాక్సీ ఎం 21 2021 ఎడిషన్స్ తో ఈ ఫోనో ఫోటీ పడుతోంది.

ధర….
రెడ్‌మీ 10లో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ 4 జీబీ ర్యామ్ , 64జీబీ స్టోరేజ్ ధర రూ. 10,999గా నిర్ణయించింది కంపెనీ. 6జీబీ ర్యామ్, 128జిబి స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 12,999గా ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ మూడు రంగుల్లో కరీబియన్ గ్రీన్, మిడ్ నైట్ బ్లాక్, పసిఫిక్ బ్లూ రంగుల్లో అందుబాటులో ఉంది. అంతేకాదు హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు కార్డులు ద్వారా కొనుగోలు చేసినట్లయితే వెయ్యి రూపాయల అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. అంటే ప్రారంభ వేరియంట్ ను పదివేలలోపూ ధరకే కొనుగోలు చేయవచ్చు.

స్పెసిఫికేషన్లు…
ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఎంఐయూఐ 13 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేస్తుంది. దీనిలో 6.7అంగుళాల హెచ్ డి+డిస్ ప్లేను అందించారు. యాస్పెక్ట్ రేషియో 20.6:9గా ఉంది. 400నిట్స్ పీక్ బ్రైట్ నెస్ ను ఇందులో అందించారు. స్క్రీన్ ప్రొటెక్షన్ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ కూడా ఉంది. 6జీబీ వరకు ర్యామ్, 128జీబీ వరకు స్టోరేజీ అందించారు. స్టోరేజీని మైక్రో ఎస్డి కార్డు ద్వారా విస్తరించుకునే అవకాశం ఉంది. క్వాల్కం స్నాప్ డ్రాగన్ 680 ప్రాసెసర్ పై ఈ ఫోన్ పనిచేస్తుంది. 6000ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు. 18వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ను సపోర్టు చేస్తుంది.

కెమెరాలు…
కెమెరాల గురించి చెప్పుకుంటే…ఇందులో బ్యాక్ సైడ్ రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్ధ్యం 50 మెగాపిక్సెల్. 2 మెగాపిక్సెల్ పొర్ ట్రెయిట్ సెన్సార్ కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫ్రంట్ సైడ్ 5 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.

4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్ వీ 5.0, జీపీఎస్, ఏ-జీపీఎస్, యూఎస్బీ టైప్ -సి పోర్టు 3.5ఎంఎం హెడ్ ఫోన్ జాక్ ఇందులో ఉన్నాయి యాక్సెలరో మీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్ లు కూడా ఉన్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫోన్ బ్యాక్ సైడ్ ఉంది.