Yuzvendra Chahal: పదేండ్ల క్రితం ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన టీమిండియా వెటరన్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ పరిమిత ఓవర్లో ఎన్నో రికార్డులు నమోదు చేశాడు. టీమిండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్న చాహల్ వన్డే, టీ20 ఫార్మెట్లో తన పేరిట అరుదైన రికార్డులు నెలకొల్పాడు. కానీ చాహల్ కు ఇప్పటివరకు రెడ్ బాల్ క్రికెట్ ఆడే అవకాశం రాలేదు. పరిమిత ఓవర్లకే పరిమితమైన యుజ్వేంద్ర చహల్ రెడ్ బాల్ క్రికెట్లోనూ ఆడాలని అనుకుంటున్నాడు. సుదీర్ఘ ఫార్మెట్లో ఆడటమే తన కలగా భావిస్తున్నాడు. తాజాగా యుజ్వేంద్ర చహల్ తన మనసులో ఉన్న విషయాన్ని బయటపెట్టాడు.
యుజ్వేంద్ర చహల్…సరదా సరదాగా ఉంటూ ఎప్పుడూ ఎదో చిలిపి పనులతో సోషల్ మీడియాలో కనిపిస్తుంటాడు. ఎవ్వరితో విరోధం పెట్టుకోడు. టీమిండియా జట్టు, విదేశీ జట్టు అనే బేధం లేకుండా అందరితో కలివిడిగా ఉంటాడు. ఇక ఆయన వన్డే, టీ20, ఐపీఎల్ లో అనేక రికార్డులు సృష్టించాడు. కానీ యుజ్వేంద్ర చహల్ ఇప్పటివరకు టెస్ట్ ఫార్మెట్లో అడుగుపెట్టలేకపోయాడు.
నిజానికి భారత జట్టు లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ కల ఇంకా నెరవేరలేదు. టెస్టు క్రికెట్‌లోకి అరంగేట్రం చేయడం తన కల. టీ20, వన్డేల్లో అద్భుత ప్రదర్శన కనబరిచిన చాహల్‌కి ఇంకా టెస్టుల్లో ఆడే అవకాశం రాలేదు. ప్రస్తుతం చాహల్ టెస్టు అరంగేట్రం కోసం ఎదురుచూస్తున్నాడు. యుజ్వేంద్ర చహల్ తాజా ఇంటర్వ్యూలో దేశానికి ఆడాలనేది ప్రతి ఒక్కరి కల అని చాహల్ అన్నాడు. టెస్టుల్లో అరంగేట్రం చేయాలని కోరుకుంటున్నాను. వైట్ బాల్ క్రికెట్‌లో నేను చాలా సాధించాను. కానీ రెడ్ బాల్ క్రికెట్ ఇప్పటికీ నా చెక్‌లిస్ట్‌లో ఉందని చెప్పాడు
నా కలను సాకారం చేసుకోవడానికి దేశవాళీ క్రికెట్, రంజీల్లో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నాను. త్వరలోనే భారత టెస్టు జట్టుకు ఆడే అవకాశం వస్తుందని భావిస్తున్నాను. అంతేకాకుండా నా పేరు ముందు టెస్ట్ క్రికెటర్ అనే ట్యాగ్ ఉండాలనుకుంటున్నాను అని చాహల్ చెప్పాడు. నా ఈ కోరిక త్వరలో తీరుతుందని ఆశిస్తున్నాను అని తెలిపారు.
Read More: Linkedin : కుర్ర సీఈవోను నిషేధించిన లింక్డ్ఇన్.. మండిపడుతున్న నెటిజన్లు.. ఎందుకంటే?