తెలంగాణలో ఈరోజు ప్రారంభమయిన శాసనసభ సమావేశాల నుంచి కాంగ్రెస్ వాకౌట్ చేసింది. గవర్నర్ ప్రసంగం లేకుండా ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడిందని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ విషయం పై ప్రతిపక్షాలు పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తగా స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అనుమతించలేదు.
ఈ నేపధ్యంలో కాంగ్రెస్ సభ్యులు వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. గవర్నర్ ప్రసంగం లేకుండా రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను ప్రారంభించడం సరికాదని, దీనిపై మాట్లాడేందుకు తమకు స్పీకర్ అనుమతి ఇవ్వలేదని, అందుకే సభ నుంచి వాకౌట్ చేశామనికాంగ్రెస్ నేతలు వెల్లడించారు.
