Honour Killing Facts: భువనగిరి పరువు హత్య కేసులో విస్తుపోయే నిజాలు..!!

భువనగిరి పరువు హత్య కేసులో కీలక పరిణామం బయటకు వచ్చింది. రూ. 10లక్షలు సుఫారి ఇచ్చి రామకృష్ణను హత్య చేయించాడు భార్గవి తండ్రి వెంకటేశ్.

  • Written By:
  • Publish Date - April 18, 2022 / 09:39 AM IST

భువనగిరి పరువు హత్య కేసులో కీలక పరిణామం బయటకు వచ్చింది. రూ. 10లక్షలు సుఫారి ఇచ్చి రామకృష్ణను హత్య చేయించాడు భార్గవి తండ్రి వెంకటేశ్. పరువు కోసమే అల్లుడిని చంపించాడు. పథకం ప్రకారమే ఈ హత్య జరిగినట్లు తెలుస్తోంది. భూమి కావాలంటూ రామకృష్ణను ట్రాప్ చేశారు నిందితులు. ముందుగా భూమి కావాలని జిమ్మాపూర్ సర్పంచ్ భర్త యాకయ్య… వెంకటేశ్‌తో మాట్లాడాడు. ఆ తర్వాత రామకృష్ణకు లతీఫ్‌ను యాకయ్య పరిచయం చేశాడు. ఈ క్రమంలోనే రామకృష్ణను లతీఫ్ గ్యాంగ్ హైదరాబాద్‌లో కిడ్నాప్ చేసింది. తర్వాత సిద్ధిపేట దగ్గర హత్య చేసి పాతిపెట్టేశారు. ఈ కేసులో భార్గవి తండ్రి వెంకటేశ్ సహా 14 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

రామకృష్ణను హత్య చేసిన లతీఫ్ గ్యాంగ్ అతని భార్య భార్గవిని కూడా బెదిరించింది. రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ చూపించాల్సిందిగా లతీఫ్… రామకృష్ణకు ఫోన్ చేసి పిలిచాడు. నమ్మకం కలిగించేందుకు రామకృష్ణ ఖాతాకు కొంత డబ్బు కూడా ట్రాన్స్ ఫర్ చేశాడు. ఈ విషయం అతని భార్య భార్గవికి కూడా తెలుసు. దీంతో లతీఫ్‌కు ఫోన్ చేసిన భార్గవి తన భర్త ఆచూకీ గురించి అడిగింది. అయితే లతీఫ్ భార్గవిని కూడా బెదిరించాడు.

రామకృష్ణ 2020 ఆగష్టు 16న భార్గవిని ప్రేమ వివాహం చేసుకొన్నాడు. స్వంత గ్రామం లింగరాజుపల్లెలోనే భార్యతో రామకృష్ణ కాపురం పెట్టాడు. అయితే భార్గవి గర్భవతి కావడంతో తరచూ ఆసుపత్రికి వెళ్లాల్సి రావడంతో తన నివాసాన్ని భువనగిరికి మార్చాడు. ఈ మధ్యే భార్గవి ఆడపిల్లకు జన్మనిచ్చింది. తుర్కపల్లి గుప్తనిధుల కేసులో రామకృష్ణ సస్పెండ్ కు అయ్యాడు. దీంతో రామకృష్ణ రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి వచ్చాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న రామకృష్ణను లతీఫ్ భూమిని చూపించాలని పిలిపించి హత్య చేశారని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే 16 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రామకృష్ణ మామ వెంకటేష్ సూచనలతోనే లతీఫ్ గ్యాంగ్ రామకృష్ణను హత్య చేసిందని పోలీసులు గుర్తించారు.