Realtor Suicide: రియల్ ఎస్టేట్ ద్వారా వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇటీవల కాలంలో రియల్ బిజినెస్ లో నష్టపోయి ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలు వెలుగు చూశాయి. తాజాగా సంగారెడ్డిలో రియల్ బిజినెస్ చేస్తున్న వ్యాపారి ఆత్మహత్యకు పాల్పడి తనువు చాలించాడు.
అప్పుల బాధతో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సంగారెడ్డిలో చోటుచేసుకుంది. పఠాన్ చెరు మండలం రామేశ్వరం బండ గ్రామానికి చెందిన చెన్నకేశవ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. ఈ క్రమంలో అప్పులు బాగా పెరిగాయి. అప్పులు ఇచ్చిన వారు ఇంటికి వచ్చి ప్రశ్నించడం, అలాగే ఇచ్చిన అప్పు ఎప్పుడు తిరిగి ఎప్పుడు చెల్లిస్తావని ఫోన్ చేసి అడగడంతో చెన్నకేశవ రెడ్డి మనస్థాపానికి గురయ్యాడు. దీంతో అప్పుల బాధ భరించలేక గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వెంటనే కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. పటాన్‌చెరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: Ramu : ‘రాము’ పనితనాన్ని మెచ్చుకున్న ఆనంద్ మహీంద్రా