Site icon HashtagU Telugu

Reactor Explosion: విశాఖ ఫార్మా ల్యాబ్‌లో పేలిన రియాక్టర్.. ఇద్దరికీ గాయాలు

Reactor Explosion

New Web Story Copy 2023 06 30t152105.869

Reactor Explosion: విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్ ఫార్మాస్యూటికల్ ల్యాబ్‌లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు గాయపడినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. ప్రస్తుతానికి అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ల్యాబ్‌లో ఇంకా మంటలు అదుపులోకి రాలేదు. అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. నాలుగు ఫైరింజన్లకు పైగా సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు సహాయక చర్యలు చేపట్టారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తుంది.

విశాఖపట్నం అనకాపల్లి మండలం అచ్యుతాపురం ఇండస్ట్రియల్ స్పెషల్ ఎకనామిక్ జోన్‌లో ఉన్న ఫార్మాస్యూటికల్ ల్యాబ్‌లో మంటలు ఎగసిపడ్డాయి. అకస్మాత్తుగా రియాక్టర్ పేలుడు కారణంగా మంటలు చెలరేగాయని అనకాపల్లి పోలీసు సూపరింటెండెంట్ మురళీకృష్ణ తెలిపారు. మంటలు చెలరేగడంతో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

అయితే ఈ ఘటన ఎలా జరిగింది? సంస్థ నిర్లక్ష్యం వహించిందా అనే విషయంపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతామన్నారు ఎస్పీ మురళీకృష్ణ తెలిపారు.

Read More: Telangana Congress: కాంగ్రెస్ ఖమ్మం సభపై కేసీఆర్ కుట్ర?