IPL 2025 : ఐపీఎల్ 2025లో మరో మహా సమరం జరుగనుంది. 17 ఏళ్లుగా టైటిల్ అందుకోలేని ఆర్సీబీ ఈ సారి మాత్రం ఎలాగైనా ట్రోఫీ చేజిక్కించుకోవాలని గట్టి పట్టుదలతో బరిలోకి దిగుతోంది. జూన్ 3 మంగళవారం నాడు అహ్మదాబాద్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో ఫైనల్ మ్యాచ్‌లో తలపడనుంది. గమనించదగ్గ విషయం ఏమిటంటే.. ఈ రెండు జట్లు ఇప్పటి వరకు ఒక్క ఐపీఎల్ టైటిల్ కూడా గెలవలేదు. దీంతో ఈ ఫైనల్లో గెలిచే జట్టు కొత్త ఛాంపియన్‌గా నిలవనుంది. ఇక మ్యాచ్‌పై క్రికెట్ ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. విరాట్ కోహ్లీ నేతృత్వంలోని ఆర్సీబీ ట్రోఫీ గెలవాలని కోట్ల మంది అభిమానులు ఆశిస్తున్నారు. ఐపీఎల్ ఆరంభం నుంచే ఆ జట్టు విజయానికోసం పోరాడుతోంది. మరోవైపు శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలోని పంజాబ్ కింగ్స్ కూడా టైటిల్ కోసమే తపిస్తున్నారు. వారి సమర్థవంతమైన ప్రదర్శన పట్ల అభిమానుల అంచనాలు పెరిగాయి.
Online Shopping : ఆన్‌లైన్ షాపింగ్ లో తెలంగాణ టాప్
ఈ నేపథ్యంలో ఆర్సీబీకి మద్దతుగా కర్ణాటక ప్రభుత్వమే రంగంలోకి దిగడం విశేషం. ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ప్రత్యేకంగా వీడియో విడుదల చేసి, “ఈ సారి కచ్చితంగా ఆర్సీబీ గెలుస్తుంది.. ఈ సాలా కప్ నమ్‌దే” అంటూ ఉత్సాహాన్నిపంచారు. బెంగళూరును కేంద్రంగా తీసుకున్న ఆర్సీబీ, కర్ణాటకకు గర్వకారణంగా మారింది. సన్‌రైజర్స్‌ను తెలుగువాళ్లు ఎలా ప్రేమించారో, ఆర్సీబీ కూడా కర్ణాటక ప్రజల గుండెల్లో అదే స్థానం సంపాదించుకుంది. ఈ సాయంత్రం ఫలితం ఏదైనా కావొచ్చు.. కానీ నేటి రాత్రి ఐపీఎల్‌కు కొత్త చాంపియన్ రావడం మాత్రం ఖాయం.