Site icon HashtagU Telugu

RCB Black Band:బ్లాక్ బ్యాండ్ ధరించి మైదానంలోకి దిగిన RCB ఆటగాళ్లు…కారణం ఇదే…!!

Rcb Black Imresizer

Rcb Black Imresizer

తమ సహచర క్రికెటర్ సోదరి చనిపోయినందుకు RCB ఆటగాళ్లు నేడు CSKతో జరుగుతున్న IPL T20 మ్యాచులో సంఘీభావం తెలిపారు. మంగళవారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాళ్లు మైదానంలో బ్లాక్ బ్యాండ్‌లు ధరించి కనిపించారు. సాధారణంగా క్రీడల్లో నివాళి అర్పించేందుకు ఆటగాళ్లు బ్లాక్ బ్యాండ్ కట్టకొని ఆడుతుంటారు. నవీ ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచులో RCB ఆటగాళ్ళు తమ సహచరుడు హర్షల్ పటేల్‌కు సంఘీభావం తెలిపేందుకు బ్యాండ్‌లను ధరించినట్లు సమాచారం. హర్షల్ సోదరి రెండు రోజుల క్రితం అనారోగ్యంతో మరణించింది. ఇలాంటి కష్ట సమయాల్లో తన కుటుంబంతో కలిసి ఉండటానికి హర్షల్ పటేల్ టోర్నమెంట్ బయో-బబుల్‌ను విడిచిపెట్టి తన స్వస్థలం పయనమయ్యాడు. .

వివరాల్లోకి వెళితే శనివారం ముంబై ఇండియన్స్ తో మ్యాచ్ అనంతరం హర్షల్ పటేల్ కు తన సోదరి మరణించిన విషయం తెలిసింది. దీంతో హుటాహుటిన హర్షల్..తన స్వరాష్ట్రం గుజరాత్ బయల్దేరాడు. హ పూణే నుంచి నేరుగా గుజరాత్ వెళ్లినట్టు ఆర్సీబీ వర్గాలు తెలిపాయి.

అయితే గత కొన్నాళ్లుగా హర్షల్ పటేల్ సోదరి అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని, ఈ క్రమంలోనే ఆమె కన్నుమూసినట్లు ట్విట్టర్ లో పలువురు ట్వీట్ చేశారు. సోదరి మరణవార్త.. తెలియగానే పూణే నుంచి ప్రత్యేక పర్మిషన్ తీసుకుని గుజరాత్ వెళ్లిన హర్షల్.. తిరిగి జట్టుతో ఎప్పుడు చేరతాడు..అనేది ఇంకా పూర్తి సమాచారం తెలియదు.

కాగా గతేడాది ఐపీఎల్ సీజన్ లో అత్యధిక వికెట్ల (32) తో పర్పుల్ క్యాప్ దక్కించుకున్న హర్షల్ పటేల్.. ఇప్పటివరకు ఈ సీజన్ లో నాలుగు మ్యాచులాడి 6 వికెట్లు తీశాడు. మిడిల్ ఓవర్స్ తో పాటు డెత్ ఓవర్లలో పొదుపుగా బౌలింగ్ చేయడంలో స్పెషలిస్ట్ అయిన హర్షల్.. శనివారం ముంబై తో జరిగిన మ్యాచులో నాలుగు ఓవర్లు వేసి 23 పరుగులే ఇచ్చి రెండు కీలక వికెట్లు తీసుకున్నాడు. రోహిత్ శర్మ కూడా హర్షల్ బౌలింగ్ లోనే ఔటయ్యాడు.