Viral : ఐపీఎల్ 2025 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) అదరగొట్టింది.. టోర్నమెంట్ మొదట్నుంచీ చివరి వరకూ వాళ్ల ఆటతో అందరినీ ఆకట్టుకున్నారు. రీసెంట్‌గా జరిగిన క్వాలిఫయర్-1లో బలమైన పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్)ను ఓడించి ఫైనల్‌లోకి దూసుకుపోయారు. దీంతో ఆర్‌సీబీ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఈసారైనా బెంగళూరు కప్పు గెలవాలని కోరుకుంటున్నారు.
Shahneel Gill: గుజరాత్ టైటాన్స్ ఓటమి.. బోరున ఏడ్చిన గిల్ సోదరి!
ఆర్‌సీబీ గెలుపు కోసం కొందరు ఫ్యాన్స్ పూజలు కూడా మొదలుపెట్టారు. చాలామంది దేవాలయాలకు వెళ్లి తమ అభిమాన జట్టు ఫైనల్లో గెలవాలని మొక్కుకుంటున్నారు. ఈ క్రమంలో, ఒక ఆర్‌సీబీ అభిమాని తన భక్తిని, దేవుడిపై తనకున్న నమ్మకాన్ని ఆర్‌సీబీ టీమ్‌పై చూపించాడు. ఆ అభిమాని కొండగట్టు అంజన్న హుండీలో ఒక చీటీ రాసి వేశాడు. ఆ చీటీలో “ప్లీజ్ దేవుడా.. ఈసారి ఆర్‌సీబీ ట్రోఫీ గెలవాలి.. ఈసారి కప్ మనదే” అని రాసి ఉంది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఇదే తరహాలో, క్వాలిఫయర్-1లో పంజాబ్‌తో బెంగళూరు ఆడుతున్నప్పుడు ఒక మహిళా అభిమాని ప్రదర్శించిన ప్లకార్డు కూడా నెట్టింట్లో హల్‌చల్ చేసింది. “ఈసారి ఆర్‌సీబీ జట్టు ఐపీఎల్ టైటిల్ గెలవకపోతే తన భర్తకు విడాకులు ఇస్తా” అని ప్లకార్డుపై రాసి స్టేడియంలో చూపించిందామె. దీనిపై కింగ్ కోహ్లీ హ్యాష్‌టాగ్‌ను కూడా పెట్టడం విశేషం. అభిమానుల కోరిక మేరకు బెంగళూరు ఈసారి టైటిల్ సాధిస్తుందేమో చూడాలి. ఇప్పటివరకు మూడుసార్లు ఫైనల్‌కు వెళ్లి, త్రుటిలో కప్ చేజార్చుకుంది. ఇప్పుడు నాలుగోసారి ఆర్‌సీబీ ఫైనల్‌కు వెళ్లింది. జూన్ 3న అహ్మదాబాద్‌లో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. రేపు (ఆదివారం) ఇదే వేదికలో జరిగే క్వాలిఫయర్-2 (ముంబై ఇండియన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్) విజేతతో ఆర్‌సీబీ ఫైనల్లో తలపడనుంది.
Bhatti Vikramarka: ఎస్సీ, ఎస్టీ, బీసీల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం: భట్టి విక్రమార్క