Currency: 500 నోట్లపై ఆర్బీఐ కీలక నిర్ణయం… దొంగనోట్లు ఇలా పసిగట్టాలి!

చాలా సార్లు ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేస్తున్నప్పుడు చిరిగిపోయిన లేదా పాత నోట్లు వస్తుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు చాలా ఆందోళనకు గురవుతున్నారు.

  • Written By:
  • Publish Date - February 23, 2023 / 08:13 PM IST

Currency: చాలా సార్లు ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేస్తున్నప్పుడు చిరిగిపోయిన లేదా పాత నోట్లు వస్తుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు చాలా ఆందోళనకు గురవుతున్నారు. కానీ అలా ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటోంది రిజర్వ్ బ్యాంకు ఆఫ్‌ ఇండియా. దీని కోసం ఆర్బీఐ మార్గదర్శకాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

100, 200, 500 రూపాయల నోట్లను భారతీయ రిజర్వ్ బ్యాంక్ జారీ చేస్తుంది. అయితే దేశవ్యాప్తంగా నోట్ల రద్దు తర్వాత,నోట్ల గురించి అనేక రకాల వైరల్, ఫేక్ వార్తలు తెరపైకి వస్తున్నాయి. అయితే దేశ వ్యాప్తంగా ఎవరైనా పాత లేదా మ్యుటిలేటెడ్ నోట్లు మార్చాలనుకుంటే, ఇప్పుడు సులభంగా ఆ పని చేసేయవచ్చు.

దొంగనోట్ల పనిపట్టాలని కేంద్ర ప్రభుత్వం పాత నోట్లను రద్దు చేసింది. ఆ సందర్భంలోనే కొత్తనోట్లను తెచ్చింది. అయితే ఈ కొత్తనోట్లలోనూ ఆ బెడద తప్పటం లేదు. అనేక మంది దొంగనోట్లు తీసుకొని మోసపోతున్నారు. వీటిని ఎలా గుర్తుపట్టాలనే దానిపై ఆర్బీఐ ప్రజల్ని అలర్ట్‌ చేసే క్రమంలో భాగంగా సూచనలు ఇస్తుంది.

ఇందుకోసం తాజాగా ఆర్బీఐ నకిలీ నోటుకు, నిజమైన నోటుకు మధ్య ఉన్న తేడాతో కొన్ని ఫోటోలను విడుదల చేసింది. అంతేకాకుండా ఏ విధంగా గుర్తించాలనే దానిపైనా కొన్ని ఇండికేటర్సును మెన్సషన్‌ చేసింది. ప్రజలు తస్మా జాగ్రత్తగా ఉండాలనే ఇలా అలర్ట్‌ చేస్తున్నామని ఆర్బీఐ అధికారులు పేర్కొన్నారు. మరోవైపు పాత నోట్లపైనా పలు విషయాలను ఆర్బీఐ వెల్లడించింది.

నోట్లు చాలా మురికిగా మారి, వాటిలో చాలా మట్టి ఉంటే అటువంటి పరిస్థితిలో అవి పనికిరానివిగా పరిగణిస్తారు. అంచు నుండి మధ్యకు చిరిగిన నోట్లు తీసుకోరు. నోట్‌లో తయారు చేసిన కుక్క చెవుల వైశాల్యం 100 చదరపు మిల్లీమీటర్ల కంటే ఎక్కువగా ఉంటే, అది పనికిరాదని చెబుతోందీ ఆర్బీఐ. ‌‌పెన్నులోని సిరా నోట్లో పూసుకుంటే అది పనికిరాని నోటు. నోట్లో టేప్, జిగురు వంటి అంశాలు ఉంటే, అటువంటి నోటు అన్ ఫిట్ గా పరిగణించబడుతుంది.

ఇంకోవైపు చాలా మంది వద్ద ఇప్పటికీ పాత 500 నోట్లు ఉన్నాయి. వాటిని ఎలా మార్పించుకోవానే సందేహం ఉంది. ఇలాంటి సందర్భంలో ఎలాంటి కంగారు లేదు. బ్యాంకులోని ఏదైనా శాఖను సందర్శించడం ద్వారా అటువంటి నోట్లను మార్చుకోవచ్చు. బ్యాంకు ఉద్యోగి మీ నోట్‌ని మార్చుకోవడానికి నిరాకరిస్తే, మీరు దీని గురించి ఫిర్యాదు కూడా చేయవచ్చు.