Site icon HashtagU Telugu

RBI: అర్ధరాత్రి ఫోన్ చేశారో.. రికవరీ ఏజెంట్లకు షాకింగ్ వార్నింగ్ ఇచ్చిన ఆర్‌బీఐ!

0000

0000

ప్రజలు బ్యాంకుల నుంచి, ఇతర ఆర్థిక రుణ సంస్థల నుంచి రుణాలు తీసుకున్న తర్వాత.. తిరిగి ఆ రుణాలను వసూలు చేయడానికి రికవరీ ఏజెంట్ లు దురుసుగా ప్రవర్తిస్తూ ఉన్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రికవరీ ఏజెంట్ల కు గట్టి వార్నింగ్ ఇచ్చింది. రాత్రి పొద్దుపోయిన తర్వాత ఫోన్ చేయడం పైగా తమ నోటికి వచ్చినట్లు మాటలు మాట్లాడటం కరెక్ట్ కాదు అని ఆర్.బి.ఐ గవర్నర్ శక్తి కాంత దాస్ వార్నింగ్ ఇచ్చారు.

అర్ధరాత్రి దాటిన తరువాత ఫోన్ లు చేయటం, అభ్యంతరకరమైన భాష మాట్లాడటం వంటి ఫిర్యాదులు తమకు అందాయని.. ఇటువంటివి చేస్తే ఆర్థిక సంస్థలు తామే ముప్పు తెచ్చుకుంటున్నట్లు అవుతుంది అని అన్నారు. రికవరీ ఏజెంట్ల ఆగడాలను అసలు సహించమని, తమకు వచ్చిన ఫిర్యాదుల విషయంలో కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.

అంతేకాకుండా ఆ ఆర్థిక సంస్థలను.. సంబంధిత న్యాయ ప్రాధికార సంస్థ పరిధిలోకి తీసుకొచ్చి విచారణ చేపట్టడం జరుగుతుందని అన్నారు. ఇక రికవరీ ఏజెంట్ల పై తమకు అందిన ఫిర్యాదులను న్యాయ ప్రాధికార సంస్థ లకు బదులాయిస్తామని అన్నారు. ఇక బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు ఇలాంటి అంశాలపై అవగాహన కల్పించడం జరిగిందని.. కాబట్టి ఇటువంటి విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ చూపించాలి అని అన్నారు.