Site icon HashtagU Telugu

RBI Penalty: ఐసీఐసీఐ కోటక్ బ్యాంక్‌లపై ఆర్బీఐ జరిమానా

Bank Merger

Rbi Penalty

RBI Penalty: ఐసిఐసిఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్‌లపై కోట్ల రూపాయల జరిమానా విధించబడింది.అధికారిక నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను ఐసిఐసిఐ బ్యాంక్ లిమిటెడ్‌పై ఆర్‌బిఐ రూ. 12.19 కోట్ల పెనాల్టీ విధించింది. కోటక్ మహీంద్రా బ్యాంక్ లిమిటెడ్‌పై రూ. 3.95 కోట్ల జరిమానా విధించింది. బ్యాంకింగ్ నియంత్రణ చట్టంలోని నిబంధనలను సరిగ్గా పాటించనందుకు ICICI బ్యాంక్‌పై , రిజర్వ్ బ్యాంక్ అనేక మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు కోటక్ మహీంద్రా బ్యాంక్‌పై ఈ పెనాల్టీ విధించింది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, 1949 (BR చట్టం)లోని సెక్షన్ 20లోని సబ్-సెక్షన్ (1)ని ఉల్లంఘించినందుకు ఐసిఐసిఐ బ్యాంక్‌పై పెనాల్టీ విధించబడింది.

Also Read: HCA elections: హెచ్‌సీఏ ఎన్నికల్లో KTR, హరీష్ మద్దతు ఎవరికీ?