Andhra Pradesh: ఫలించిన జగన్ ఢిల్లీ పర్యటన..

  • Written By:
  • Updated On - January 5, 2022 / 09:20 PM IST

తాజాగా ఏపీ ప్రభుత్వాన్నికి రిజర్వు బ్యాంక్ అఫ్ ఇండియా 2500 కోట్లు రుణాన్ని మంజూరు చేసింది. అయితే సోమవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీ ని కలిసిన వెంటనే ఈ రుణం మంజూరు కావడం పట్ల ఢిల్లీ పెద్దల అశీసులు ఉన్నట్టు తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న అప్పులు అంతకంతకూ పెరుగుతున్నాయి. తాజాగా మరో 2,500 కోట్ల అప్పును ఏపీ ప్రభుత్వం చేయడంతో రాష్ట్రం పై అప్పుల భారం పెరగనుంది.

20 ఏళ్ల కాలపరిమితితో 7.22 శాతం వడ్డీతో రూ. వెయ్యి కోట్ల రుణాన్ని తీసుకుంది. మరో వెయ్యి కోట్లను 7.18 శాతం వడ్డీతో 18 ఏళ్ల కాలపరిమితికి తీసుకుంది. మరో రూ. 500 కోట్లను 16 ఏళ్ల కాలపరిమితితో 7.24 శాతం వడ్డీకి తీసుకుంది. మరోవైపు గత 8 రోజుల్లో ఏపీ ప్రభుత్వం రూ. 4,500 కోట్ల మేర అప్పు చేయడం పట్ల రాష్ట్ర ప్రభుత్వ భవిష్యత్తు ప్రశ్నగా .. మారింది.