Site icon HashtagU Telugu

Fixed Deposits : ఫిక్స్ డ్ డిపాజిటర్లకు గుడ్ న్యూస్ చెప్పి…రుణగ్రహీతలకు షాకిచ్చిన ఆర్బీఐ..!!

Rbi

Rbi

RBI…భారతీయ రిజర్వ్ బ్యాంకు రెపోరేటును అరశాతం పెంచడం వల్ల రుణాలు తీసుకున్న మరింత భారం పడనుంది. ఇప్పటికే రుణాలుతీసుకున్నవారిపై EMIలు పెరిగేందుకు దారితీయనుంది. నెలరోజుల క్రితమే ఆర్బీఐ రెపోరేటును 0.40 శాతం మేర పెంచిన సంగతి తెలిసిందే. అంటే నెల రోజుల్లోనే కీలక రేటును 0.90 శాతం పెంచింది. తాజాగా రెపోరేటు 4.90 శాతానికి చేరింది.

వాణిజ్య బ్యాంకులకు ఆర్బీఐ ఇచ్చే రుణాలపై వసూలు చేయనున్న రేటునే రెపో రేటు అంటారు. ఈ రేటుకు బ్యాంకులు తమ మార్జిన్ , రిస్క్ కలుపుకుని రుణాలపై రేట్లు ప్రకటిస్తాయి. ఆర్బీఐ రెపోరేటును పెంచినప్పుడల్లా గృహ రుణాలు, వాహన రుణాలు, వ్యక్తిగత రుణాలపై రేట్లు సవరిస్తాయి. దీంతో EMIపెరగడం లేదంటే రుణ కాలవ్యవధి పెరగడం జరుగుతుంది.

ఉదాహరణకు రూ. 30లక్షల గృహ రుణాన్ని 20ఏళ్ల కాలానికి 7శాతం వడ్డీరేటుపై తీసుకున్నట్లయితే…ఇప్పుడు పెంచిన తర్వాత ఈఎంఐ రూ. 1,648కి పెరుగుతుంది. అంటే అప్పుడు నెలవారీ ఈఎంఐ రూ. 23, 259 నుంచి రూ. 24, 907కి చేరుతుంది. ఒకవేళ వెహికల్ లోన్ తీసుకున్నట్లయితే రూ. 8లక్షలను 7 ఏళ్ల కాలానికి 10శాతం రేటుపై తీసుకున్నట్లయితే…నెల రోజుల్లో 0.90శాతం పెరగడం వల్ల ఈఎంఐ రూ. 375 పెరుగుతుంది. అంతేకాదు 5 లక్షల పర్సనల్ లోన్ ఐదేళ్ల కాలానికి తీసుకుంటే వడ్డీ రేటు 14శాతం నుంచి 14.9శాతానికి పెరుగుతుంది. ఈఎంఐ రూ. 235మేర పెరగుతుంది.

ఇక ఫిక్స్ డ్ డిపాజిట్లపై వడ్డీరేటు 7శాతం దిగువనకు తగ్గడంతో…ఇప్పటివరకు వృద్ధాప్యంలో డిపాజిట్లపైనే ఆధారపడిన వారిని నిరాశకు గురిచేసింది. తాజా పెంపు తర్వాత డిపాజిట్లపైనా ఒక శాతం వరకు అదనపు రాబడికి అవకాశం ఏర్పడినట్లయింది.

Exit mobile version