Site icon HashtagU Telugu

Rayudu: రాయుడుకి గాయం..చెన్నై టెన్షన్?

Rayudu

Rayudu

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 15 వ సీజన్ ఈ నెల 26న ఘనంగా ఆరంభం కానుంది. ఆరంభం పోరులో భాగంగా గతేడాది చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ తో రన్నరప్ కోల్ కతా నైట్ రైడర్స్ తలపడనుంది. అయితే ఆటగాళ్ళ గాయాలు చెన్నై ని టెన్షన్ పెడుతున్నాయి. తాజాగా ఆ జట్టుకు మరో షాక్ తగలనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఆ జట్టు స్టార్ పేసర్ దీపక్ చహర్ గాయంతో సతమతమవుతుండగా.. తాజాగా ఆ జాబితాలో మరో వెటరన్ ప్లేయర్ చేరేలా కనిపిస్తున్నాడు. తాజాగా సూపర్ కింగ్స్ జట్టు ఓ వీడియోను ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. అయితే వీడియోలో అంబటి రాయుడు తన చేతికి కట్టుతో కనిపించాడు.

అతడి ఏడం చేతికి బ్యాండేజ్ వేసి ఉంది. దాంతో చెన్నై సూపర్ కింగ్స్ అభిమానుల్లో ఆందోళన మొదలైంది. అయితే అంబటి రాయుడి గాయం గురించి చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఐపీఎల్ ఆరంభానికి మరో రెండు వారాల సమయం ఉండటంతో అతడు కోలుకునే అవకాశం ఉంది. ఒక వేళ కోలుకోలేకపోతే మాత్రం చెన్నైకి తిప్పలు తప్పవు. తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నాడు. రీ ఎంట్రీతో అందరికి హాట్ కేక్ గా మారిన అంబటి రాయుడు ఐపీఎల్ చరిత్రలో మంచి గణాంకాలే నమోదు చేశాడు. 36 ఏళ్ల రాయుడు తన ఐపీఎల్‌ కెరీర్‌లో మొత్తం 175 మ్యాచ్‌లు ఆడి 29 స‌గ‌టుతో 3916 ప‌రుగులు చేశాడు. ఇందులో 21 హాఫ్ సెంచ‌రీలు, ఓ సెంచ‌రీ ఉన్నాయి.

Exit mobile version