World Cup 2023: అశ్విన్ రిటైర్మెంట్?

అక్టోబర్ 5 నుంచి ప్రారంభమయ్యే ప్రపంచ కప్ కోసం టీమిండియా సన్నద్ధంగా ఉంది. రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా ఈ ఏడాది ప్రపంచ కప్ లో లక్ పరీక్షించుకోబోతుంది.

Published By: HashtagU Telugu Desk
World Cup 2023 (4)

World Cup 2023 (4)

World Cup 2023: అక్టోబర్ 5 నుంచి ప్రారంభమయ్యే ప్రపంచ కప్ కోసం టీమిండియా సన్నద్ధంగా ఉంది. రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా ఈ ఏడాది ప్రపంచ కప్ లో లక్ పరీక్షించుకోబోతుంది. ఈ మెగాటోర్నీ కోసం ఇప్పటికే 15 మంది సభ్యులతో కూడిన టీమిండియా జట్టును బీసీసీఐ ప్రకటించింది. గత ఆసియా కప్ లో గాయపడిన అక్షర్ పటేల్ కు ప్రపంచ కప్ లో స్థానం దక్కలేదు. అక్షర్ స్థానంలో వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కు చోటు కల్పించారు. అయితే తాజాగా అశ్విన్ షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. అశ్విన్ ప్రకటనతో ఫ్యాన్స్ నిరాశకు గురవుతున్నారు. ఇంతకీ అశ్విన్ స్టేట్మెంట్ ఏంటో తెలుసా?

ప్రపంచ కప్ కు ముందు వామప్ మ్యాచ్ లు ప్రారంభమయ్యాయి. ఈ రోజు శనివారం సొంతగడ్డపై డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్‌తో భారతదేశం మొదటి వార్మప్ మ్యాచ్‌ ఆడుతుంది. ఈ క్రమంలో అశ్విన్ తన రిటైర్మెంట్ పై ప్రకటన చేశాడు. 37 ఏళ్ల అశ్విన్ మాట్లాడుతూ.. భారత్‌కు ఇది నా చివరి ప్రపంచకప్ కావచ్చు, కాబట్టి టోర్నమెంట్‌ను ఆస్వాదించడం చాలా ముఖ్యం అని అశ్విన్ స్టార్ స్పోర్ట్స్‌తో అన్నారు.

ప్రపంచకప్ చరిత్రలో అశ్విన్ భారత్ తరఫున 10 మ్యాచ్‌లు ఆడాడు, చివరిసారిగా 2015లో ఆడాడు. 24.88 సగటుతో 17 వికెట్లు సాధించాడు మరియు విరాట్ కోహ్లీతో పాటు 2011లో ప్రపంచ కప్ విజేతగా నిలిచిన ప్రస్తుత భారత జట్టులో అశ్విన్ మాత్రమే సభ్యుడు.

Also Read: Congress : మొండిచేయికి ఓటేస్తే 3 గంట‌ల క‌రెంట్ గ్యారెంటీ, ఏడాదికో సీఎం – కేటీఆర్

  Last Updated: 30 Sep 2023, 08:26 PM IST