Ravi Teja- Gopichand: రవితేజ- గోపిచంద్ మూవీ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది..!

రవితేజతో గోపీచంద్ మలినేని (Ravi Teja- Gopichand)కు ఇది నాలుగో సినిమా. దీనికి థమన్ సంగీతం అందించనున్నాడు. ఈ మూవీని అనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్ ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Published By: HashtagU Telugu Desk
Ravi Teja- Gopichand

Resizeimagesize (1280 X 720)

Ravi Teja- Gopichand: మాస్ మహరాజ్ రవితేజ కొత్త సినిమా అనౌన్స్‌ చేశాడు. ఈ సారి గోపిచంద్ మలినేని దర్శకత్వంలో మరో మూవీకి సిద్ధమయ్యాడు. మైత్రీ మూవీస్ బ్యానర్‌పై ఈప్రాజెక్ట్ తెరకెక్కనున్నట్లు నిర్మాతలు నేడు ప్రకటించారు. కాగా రవితేజతో గోపీచంద్ మలినేని (Ravi Teja- Gopichand)కు ఇది నాలుగో సినిమా. దీనికి థమన్ సంగీతం అందించనున్నాడు. ఈ మూవీని అనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్ ఆసక్తిని రేకెత్తిస్తోంది.

మాస్ మహారాజా రవితేజ గతేడాది ధమాకా సినిమాతో హిట్ అందుకున్నారు. త్రినాథరావు నక్కిన డైరెక్ట్ చేసిన ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించాయి. శ్రీలీల హీరోయిన్‌గా నటించింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా 2022 డిసెంబర్ 23న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది.

ఆ తర్వాత చిరు- రవితేజ కాంబినేషన్ లో వచ్చిన వాల్తేరు వీరయ్య సూపర్ డూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వచ్చిన రావణాసురుడు మూవీ ప్లాప్ అయింది. ఇక ఆ సినిమా తర్వాత రవితేజ నటిస్తోన్న మరో సినిమా టైగర్ నాగేశ్వరరావు. ఈ మూవీ ప్యాన్ ఇండియా సినిమాగా వస్తోంది. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ నిర్మిస్తోంది. ఈ సినిమాని దర్శకుడు వంశీ తెరకెక్కిస్తుండగా, ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా అక్టోబర్ 20న దసరా కానుకగా రిలీజ్ కానుందని మేకర్స్ ప్రకటించారు.

Also Read: T Trains Coming Soon : స్టీమ్ ఇంజన్ కాని స్టీమ్ ఇంజన్ తో “టీ ట్రైన్స్”.. రాయల్ ఫీచర్స్ తో ఎంట్రీ

రవితేజ, గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో గతంలో డాన్ శీను, బలుపు, క్రాక్ మూవీల తర్వాత నాల్గోసారి కలిసి పని చేయడానికి రెడీ అవుతున్నారు. దీనికి సంబంధించిన అఫీషియల్ ప్రకటన చేసారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో రవితేజ హీరోగా నటిస్తోన్న మూడో సినిమా ఇది.

గతంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో ‘అమర్ అక్బర్ ఆంటోని’, వాల్తేరు వీరయ్య’ తర్వాత వస్తోన్న మూడో చిత్రం ఇది. అటు వీరసింహారెడ్డి తర్వాత మైత్రీ బ్యానర్‌లో గోపీచంద్ మలినేని రెండో చిత్రం కావడం విశేషం. రవితేజ, గోపీచంద్ మలినేని కాంబోలో సినిమా అనగానే ప్రేక్షకుల్లో అప్పుడే అంచనాలు మొదలయ్యాయి. ఈ చిత్రాన్ని వచ్చే యేడాది సమ్మర్ కానుకగా విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. మరిన్ని వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని మేకర్స్ పేర్కొన్నారు.

 

  Last Updated: 09 Jul 2023, 12:40 PM IST