Site icon HashtagU Telugu

IPL Ravi Shastri: IPL టైటిల్ రేసులో RCB-రవిశాస్త్రి

Ravi Shastri

Ravi Shastri

భారత క్రికెట్ జట్టు మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు చేశారు. ముంబై వేదికగా జరుగుతున్న IPL2022మెగా రిచ్ టోర్నీలో పాఫ్ డుప్లెసిస్ నాయకత్వంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టు ప్లే ఆఫ్స్ కు కచ్చితంగా వస్తుందని పేర్కొన్నాడు. అంతేకాదు IPLటైటిల్ రేసులో తప్పక ఉంటుందని రవిశాస్త్రి స్పష్టం చేశాడు. ప్రధానంగా డుప్లెసిస్ నాయకత్వం అద్భుతంగా ఉందని కితాబు ఇచ్చాడు రవిశాస్త్రి.

జట్టులో విరాట్ కోహ్లి, మాక్స్ వెల్ తోపాటు ఇతర ఆటగాళ్లు కూడా రాణిస్తున్నారని…ఆ జట్టుకే టైటిల్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు పేర్కొన్నాడు. ఇప్పటివరకు RCB ఆడిన ఐదు మ్యాచ్ లలో మూడు మ్యాచ్ ల్లో విజయం సాధించింది. రెండింట్లో ఓటమి చవి చూసింది. గతంలో జరిగిన IPL లీగ్ వేరు కానీ ఇప్పుడు జరుగుతున్న రిచ్ లీగ్ వేరని రవిశాస్త్రి అన్నారు. ఈ సిజన్ లో మనం కొత్త ఛాంపియన్ ను చూడబోతున్నామన్నాడు.

రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు ఈ IPLలో సత్తాచాటడం ఖాయమన్నాడు. వారు కచ్చితంగా ప్లే ఆఫ్స్ కు చేరుకోవడం ఖాయమన్న రవిశాస్త్రి…మరింత దూకుడుగా ప్రదర్శిస్తున్నారన్నారు. టోర్నీలో రోజు రోజుకు ఆడే మ్యాచ్ లలో రాటు దేలిపోతున్నారని పేర్కొన్నాడు. ప్రతిగేమ్ లో కొత్తగా తమ ప్రతిభను కనబరుస్తుండటం ఆ జట్టుకు పెద్ద అడ్వాంటేజ్ గా అభిప్రాయం వ్యక్తం చేశాడు.