Site icon HashtagU Telugu

Hyderabad : రేవ్ పార్టీని భ‌గ్నం చేసిన పోలీసులు.. 12 మంది అరెస్ట్‌

Rave

Rave

హైద‌రాబాద్ శివార్లులో పోలీసులు రేవ్ పార్టీని భ‌గ్నం చేశారు. ఇనాంగూడ గ్రామంలోని అతిథి గృహంలో రేవ్‌ పార్టీని అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీసులు ఛేదించి 12 మంది పురుషులు, మహిళలను అదుపులోకి తీసుకున్నారు. ఫామ్‌హౌస్‌లో హుక్కా తాగేందుకు వినియోగించే ప‌రిక‌రాలు, మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వనస్థలిపురానికి చెందిన ఓ మహిళ బ‌ర్త్‌డే పార్టీ అని చెప్పి రేవ్ పార్టీ నిర్వహించినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఫామ్‌హౌస్‌పై దాడి చేయడానికి ముందు .. డీజే సౌండ్స్ తో డ్యాన్సులు వేస్తుండ‌టంతో స్థానికులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. . పార్టీ కోసం మ్యూజిక్ సిస్టమ్ ఏర్పాటు చేసిన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కస్టడీలో ఉన్న వారికి కూడా పోలీసులు నోటీసులు అందించి విడుదల చేశారు.