Rats Bites: ప్రభుత్వాస్పత్రుల మార్చురీలు అనేక సమస్యలకు నిలయంగా మారుతున్నాయి. దీంతో రోగుల బంధువుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీ వద్ద ఎలుకల బెడదతో ఆసుపత్రి సిబ్బందికి, మృతుడి బంధువులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మృతదేహం ముక్కు, నుదురు, చెవులపై కొరికేసి ఉండటమే అందుకు కారణం.
ప్రగతినగర్‌కు చెందిన పి.రవి సోమవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని, దీంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మృతదేహాన్ని మార్చురీలో భద్రపరచగా.. ఎలుకలు కొరికేశాయి. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ మృతదేహాన్ని అంత్యక్రియలు నిర్వహించేందుకు తీసుకెళ్లారు.
Also Read: 30 Missings: దడ పుట్టిస్తున్న మణిపూర్ అల్లర్లు, 3 నెలల్లో 30 మంది మిస్సింగ్