Site icon HashtagU Telugu

Ratan Tata No More: ప్ర‌ముఖ పారిశ్రామికవేత్త ర‌త‌న్ టాటా క‌న్నుమూత‌

Ratan Tata Net Worth

Ratan Tata Net Worth

Ratan Tata No More: ప్రముఖ పారిశ్రామిక వేత్త, టాటా సన్స్ ఛైర్మన్‌ రతన్‌ టాటా (Ratan Tata No More) క‌న్నుమూశారు. ముంబైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసినట్లు ప్రముఖ వ్యాపారవేత్త హర్ష గోయోంకా ట్వీట్ చేశారు. రతన్ టాటా ఇకలేరని ఆయన తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ర‌త‌న్ టాటా 1937 డిసెంబ‌ర్ 28న జ‌న్మించారు. బుధ‌వారం ముంబైలోని ప్రైవేట్ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. అయితే ర‌త‌న్ టాటా మ‌ర‌ణాన్ని టాటా గ్రూప్స్ లేదా ఆసుప‌త్రి వ‌ర్గాలు ఇంకా ధ్రువీకరించలేదు. రతన్‌ టాటా.. 1990 నుంచి 2012 వరకు టాటా గ్రూప్‌ ఛైర్మన్‌గా వ్యవహరించారు.

Also Read: TCS : ఏపీకి రాబోతున్న టీసీఎస్..నారా లోకేష్ ప్రకటన

రతన్ నావల్ టాటా ఒక భారతీయ పారిశ్రామికవేత్త, టాటా సన్స్ మాజీ ఛైర్మన్. అతను 1990 నుండి 2012 వరకు టాటా గ్రూప్‌కు ఛైర్మన్‌గా ఉన్నారు. అక్టోబర్ 2016 నుండి ఫిబ్రవరి 2017 వరకు తాత్కాలిక ఛైర్మన్‌గా ఉన్నారు. అతను దాని ఛారిటబుల్ ట్రస్ట్‌లకు నాయకత్వం వహిస్తున్నాడు. దేశంలో మూడవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్ అందుకున్న తర్వాత భారతదేశంలో రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్‌ను అందుకున్నారు. రతన్ టాటా కూడా ఫలవంతమైన పెట్టుబడిదారిగా ఉన్నారు. అనేక స్టార్టప్‌లలో అనేక పెట్టుబడులు పెట్టారు. టాటా ఇప్పటి వరకు 30 స్టార్టప్‌లలో పెట్టుబడి పెట్టారు.