Site icon HashtagU Telugu

Ratan Tata: రతన్‌టాటాను ‘అస్సాం వైభవ్‌’ అవార్డు!

Tata

Tata

ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్‌టాటాను ‘అస్సాం వైభవ్‌’ అవార్డు వరించింది. అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ ముంబయిలో రతన్‌ టాటాను కలిసి తమ రాష్ట్ర అత్యున్నత పురస్కారాన్ని అందజేశారు. దాతృత్వ కార్యక్రమాల ద్వారా అస్సాంలో క్యాన్సర్‌ నివారణకు టాటా ఎనలేని సేవలందించారని కొనియాడుతూ సీఎం హిమంత బిశ్వశర్మ ఈ చిత్రాన్ని ట్విటర్‌లో పంచుకున్నారు. రతన్ టాటా ఒకవైపు పారిశ్రామికంగా సేవలందస్తూనే.. మరోవైపు ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. మిస్టర్ టాటా అస్సాంలో క్యాన్సర్ సంరక్షణకు పాటు పడినందకుగానూ అస్సాం బైభవ్ అవార్డు ప్రశంసా పత్రం, పతకం, ₹ 5 లక్షల నగదును అందజేశారు.