‘Rashtrapatni’ Row: ‘రాష్ట్రపత్ని’ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

కాంగ్రెస్ నాయకుడు ద్రౌపది ముర్మును "కించపరిచారు" అని బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

  • Written By:
  • Updated On - July 28, 2022 / 12:54 PM IST

కాంగ్రెస్ నాయకుడు ద్రౌపది ముర్మును “కించపరిచారు” అని బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ సీనియర్ నేత అధిర్ రంజన్ చౌదరి ద్రౌపది ముర్మును “రాష్ట్రపత్ని” అని పిలిచినందుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మీడియాతో మాట్లాడారు. చౌదరి వ్యాఖ్యలు ముర్మును కించపరిచేలా ఉన్నాయని మండిపడ్డారు. బేషరత్తుగా రాష్ట్రపతికి, దేశానికి కాంగ్రెస్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. చరిత్ర సృష్టించిన పేద కుటుంబానికి చెందిన గిరిజన మహిళను కాంగ్రెస్ కించపరుస్తుంది అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ రాష్ట్రపతి అభ్యర్థిగా ముర్ముని ప్రకటించినప్పటి నుండి కాంగ్రెస్ తనను “ద్వేషపూరితంగా” వ్యవహరిస్తోందని ఇరానీ ఆరోపించారు. దేశంలోని అత్యున్నత రాజ్యాంగ పదవికి ఎన్నికైన తర్వాత కూడా విమర్శలకు దిగుతున్నారని అన్నారు. రాష్ట్రపతిని హిందీలో “రాష్ట్రపతి” అంటారని, భారతదేశపు మొట్టమొదటి గిరిజన అధ్యక్షుడైన ముర్ము పోరాట జీవితాన్ని గడిపారు. పంచాయితీ నుండి పార్లమెంటు వరకు దేశానికి ప్రాతినిధ్యం వహించారని ఇరానీ అన్నారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆధ్వర్యంలోని కాంగ్రెస్ పదేపదే మహిళలను లక్ష్యంగా చేసుకుంటుందని ఇరానీ ఆరోపించారు.