Site icon HashtagU Telugu

Rashmika: ఓ ఇంటిదవుతోన్న ‘రష్మిక మందన్నా’… త్వరలోనే డేట్ ఫిక్స్..!!

rashmika

rashmika

ఇప్పుడెక్కడ విన్నా యూత్ లో ఒకటే పేరు వినిపిస్తోంది. ఎవరి డీపీలను చూసినా… ఆమె ఫొటోనే దర్శనమిస్తోంది. ఇంతకీ ఆమె ఎవరో కాదు… మన ర‌ష్మిక మంద‌న్నా నే. నాగశౌర్య హీరోగా చేసిన `ఛ‌లో` సినిమాతో హీరోయిన్ గా తెలుగు చిత్రసీమలోకి అడుగు పెట్టింది ఈ క‌న్న‌డ భామ. కెరీర్ తొలి నాళ్లలోనే వ‌రుస విజ‌యాల‌ను తన ఖాతాలో వేసుకుని, స్టార్ స్టేట‌స్‌ను సొంతం చేసుకుంది. ప్ర‌స్తుతం తెలుగుతో పాటు త‌మిళ్‌, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లోనూ వరుస సినిమాలు చేస్తున్న ఈ వైట్ బ్యూటీ .. త్వ‌ర‌లోనే ఓ ఇంటిది కాబోతోంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం..

రష్మిక మందన్నా గతేడాది ఫిబ్రవరిలోనే ముంబై నగరంలో సొంతంగా ఓ ఇం‍టిని కొనుగోలు చేసిన సంగ‌తి మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ ఇంటి గృహ‌ ప్ర‌వేశానికి సంబంధించిన ముహూర్తం ఖ‌రారైనట్లు సమాచారం. ఈ నేప‌థ్యంలోనే ర‌ష్మిక తన కొత్త సౌధానికి మారేందుకు అన్ని ఏర్పాట్లను చ‌క‌చ‌కా చేసుకుంటోంది. ఇక ఇదే విష‌యాన్ని ఆమె ఇన్ డైరెక్ట్ గా సోషల్ మీడియా ద్వారా తెలియ‌జేసింది. సామాజిక మాధ్యమాలలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ర‌ష్మిక‌ మందన్నా… తాజాగా త‌న ఇన్‌స్టాగ్రామ్‌ లో `సామాన్లు ప్యాక్ చేసుకోవడానికి చాలా కష్టపడుతున్నాను` అంటూ చెప్పుకొచ్చింది. దీంతో ఆమె త‌న కొత్తింట్లోకి అడుగుపెట్టబోతోందని… అదేనండీ… గృహ‌ప్ర‌వేశం చేయ‌బోతోంద‌ని.. అందుకే సామాన్లు స‌ద్దుకుంటోంద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. అంటే.. ఈ రకంగా రష్మిక ఓ ఇంటిది కాబోతోందన్న మాట.

ఇకపోతే, ముద్దుగుమ్మ ర‌ష్మిక సినిమాల విష‌యానికి వ‌స్తే.. ఇటీవల `పుష్ప‌` వంటి పాన్ ఇండియా చిత్రంతో ప్రేక్ష‌కుల‌ను అలరించింది. పుష్ఫ ఘనవిజయంతో పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ ను సొంతం చేసుకుంది. దీంతో రష్మిక కు బాలీవుడ్ తో పాటు పలు భాషల్లోనూ సినిమా ఆఫర్లు వస్తున్నాయి. ప్ర‌స్తుతం ఈ అమ్మడు బ‌న్నీతో `పుష్ప- 2′, శ‌ర్వానంద్‌తో `ఆడవాళ్లు మీకు జోహార్లు` చిత్రాల్లో న‌టిస్తోంది. అలాగే బాలీవుడ్‌లో సిద్ధార్థ్ మల్హోత్ర సరసన `మిషన్ మజ్ను`, అమితాబ్ బచ్చన్‌తో `గుడ్‌బై` సినిమాల్లోనూ న‌టిస్తోంది. పుష్ప మూవీలో శ్రీవల్లిగా ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసిన రష్మిక మందన్నా చేతిలో మ‌రికొన్ని ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి.