Site icon HashtagU Telugu

Rashmika Mandanna: ‘జెర్సీ’కి నో చెప్పిన రష్మిక.. ఎందుకంటే!

Rashmika

Rashmika

హీరో నాని నటించిన “జెర్సీ” సినిమా గుర్తుంది కదూ.. ఈ సినిమా ఏప్రిల్ 22న హిందీలో అదే పేరుతో విడుదలైంది. స్టోరీ అంతా సేమ్.. హీరో ఒక్కడే మారాడు. మన నానీ ప్లేస్ లో క్రికెటర్ గా షాహిద్ కపూర్ హీరో రోల్ చేశాడు. హీరోయిన్ కూడా మారింది. షాహిద్ కపూర్ భార్య పాత్రను మృణాల్ ఠాకూర్ పోషించారు. వాస్తవానికి ఈ మూవీ హీరోయిన్ ఆఫర్ తొలుత రష్మిక మందన కు వచ్చిందట. కానీ ఆమె వద్దని చెప్పడంతో నిర్మాతలు మరో హీరోయిన్ ను చూసుకున్నారట! ఇలా ఎందుకు చేశారు ? అని ఒక వార్తా సంస్థ రష్మిక ను ప్రశ్నించగా..

“నేను ప్రస్తుతం కమర్షియల్ మూవీస్ చేస్తున్నా.. అవన్నీ సాఫీగా సాగుతున్నాయి. ఇలాంటి టైం లో అంత టఫ్ పాత్రను చేయలేను అనిపించింది. మరెవరైనా.. ఆ పాత్రకు నా కంటే ఎక్కువ న్యాయం చేయగలరు అని భావించాను. అందుకే నో చెప్పాల్సి వచ్చింది. అంత టఫ్ పాత్ర ను తీసుకొని.. ఒకవేళ సరిగ్గా చేయలేకపోతే నా కెరీర్ ప్రశ్నార్ధకంగా మారే ముప్పు ఉంటుంది. అందుకే ఆచితూచి నిర్ణయం తీసుకున్నా” అని ఆమె వివరించారు.

Exit mobile version