Site icon HashtagU Telugu

Viral video : ‘సామి-సామి’ సాంగ్ లో చిన్నారి చేసిన డ్యాన్స్… రష్మిక మందన్నను పిచ్చెక్కించింది..!!

Sami Sami Song

Sami Sami Song

పుష్ప మూవీకి దేశవ్యాప్తంగా వచ్చిన క్రేజ్ అంతా ఇంతాకాదు. అందులో ప్రతి డైలాగ్ జనాల్లోకి వెళ్లింది. ఇక పాటల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సామి-సామి సాంగ్ ఎంత పాపులర్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ పాటపై ఎన్నో వీడియోలు ఇంటర్నెట్ ను షేక్ చేశాయి. అయితే ఇప్పటికీ ఆ పాటకు ఆదరణ తగ్గలేదు. సామి-సామి పాటలో ఓ చిన్నారి చేసిన డ్యాన్స్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది. స్కూల్ యూనిఫాం లో చిన్నారి తన క్లాస్ మేట్స్ తో కలిసి డ్యాన్స్ ఇరగదీసింది. సిగ్నేచర్ మూవ్స్ ను ప్రొఫెషనల్ డ్యాన్సర్ గా ఆ చిన్నారిని ఈసాంగ్ లో చూడవచ్చు.

ఈ వీడియోను తేజ అనే వ్యక్తి సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం ట్విట్టర్ షేర్ చేశాడు. దీనికి నటి రష్మిక మందన్నాను ట్యాగ్ చేశాడు. ఈ వీడియో షేర్ చేసిన కొద్ది క్షణాల్లోనే వైరల్ గా మారింది. రష్మీక ఈ వీడియోను రీట్వీట్ చేస్తూ మేడ్ మై డే…నేను ఈ లవ్లీ గర్ల్ ని కలవాలనుకుంటున్నాను…నేను నిన్ను ఎలా కలవగలను? అంటూ క్యాప్షన్ ఇచ్చింది. నెట్టింట్లో ఈ వీడియోను దాదాపు 2 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. వ్యూస్ కంటే ఎక్కువ లైకులు వచ్చాయి.

Exit mobile version