Site icon HashtagU Telugu

Rashmika Crush: చిన్నప్పట్నుంచే ఆ హీరో అంటే ఇష్టం!

Rashmika

Rashmika

ఛలో సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన రష్మిక మంధాన.. ఎన్నో వరుస హిట్స్ అందుకొని నేషనల్ క్రష్ గా మారారు. పుష్ప సినిమాతో ఈ బ్యూటీ స్టార్ డం ఒక్కసారిగా పెరిగిపోయింది. ఆ సినిమాలో అల్లు అర్జున్ గా ఎంత ఫేమ్ వచ్చిందో.. అంతే ఫేమ్ రష్మిక కూడా సొంతం చేసుకుంది. పుష్ప హిట్ అటు బాలీవుడ్, ఇటు సౌత్ సినిమాలతో బిజిగా ఉంది బ్యూటీ. త్వరలోనే బిగ్ బి అమితాబ్ తో నటించే అవకాశం దక్కించుకుంది. అయితే రష్మిక చిన్నప్పట్నుంచే ఓ హీరో అంటే ఇష్టమట. ఆయన ఎవరో కాదు..  విజయ్.

ఇక్కడ విజయ్ అంటే టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ కాదండోయ్. తమిళ్ సూపర్ స్టార్ దళపతి విజయ్ అట. ఓ నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించింది. అవును నాకు దళపతి విజయ్ అంటే చాలా ఇష్టం. చిన్నట్ప్నుంచే నాకు అతనిపై క్రష్ ఉంది. వంశీ పైడిపల్లి సినిమాలో విజయ్ పక్కన నటిస్తుండటం నన్ను షాక్ గురిచేసింది. ఇప్పటికే నేను నమ్మలేకపోతున్నా. అందుకే ఆ సినిమాలో ప్రారంభం విజయ్ కు దిష్టి తీసి, విజయ్ చూస్తూ మురిసిపోయా అని అంటోంది.