కోల్‌కతాలో వైద్య విద్యార్థినిపై దారుణంగా దాడి చేసి, అత్యాచారం చేసి, హత్య చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే.. విద్యార్థి హత్యను ఖండిస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. చిన్న పిల్లలు, యువతులు, మహిళలు, యువకులు సహా లక్షలాది మంది చీకట్లో కొవ్వొత్తులు పట్టుకుని మహిళల భద్రత కోసం నిరసనలు తెలుపుతున్నారు. అయితే ఈ ఘటన మరవకముందే.. బెంగళూరులో మరో దారుణం చోటుచేసుకుంది. ఆటోలో ప్రయాణిస్తున్న యువతిపై అత్యాచారం జరిగింది. హెచ్‌ఎస్‌ఆర్ లేఅవుట్ పోలీస్ స్టేషన్‌లో అత్యాచారం కేసు నమోదైంది.
We’re now on WhatsApp. Click to Join.
మద్యం మత్తులో ఓ మహిళ బెంగళూరులోని కోరమంగళలో అర్ధరాత్రి పబ్‌ను వదిలి ద్విచక్రవాహనంలో ఇంటికి వెళుతోంది. ఈ సమయంలో వాహనం ప్రమాదం జరగడంతో యువతి వాహనాన్ని వదిలి ఆటోలో ప్రయాణించింది. ఇంతలో ఆటో డ్రైవర్ యువతి పరిస్థితిని చూసి అవకాశంగా తీసుకున్నాడు. ఆటోలో ఉన్న యువతిని బొమ్మనహళ్లి సమీపంలోని గోదాములోకి తీసుకెళ్లి అత్యాచారం చేసినట్లు యువతి ఫిర్యాదులో పేర్కొంది. యువతి ప్రస్తుతం హెబ్బగోడిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
అత్యాచారం అనంతరం స్పృహ తప్పి పడిపోయిన బాధితురాలు మేలుకువచ్చి తన స్నేహితురాలికి ఫోన్ చేయగా స్నేహితురాలు వచ్చి ఆస్పత్రిలో చేర్పించింది. వైద్యుడు యువతిని పరీక్షించగా.. అత్యాచారానికి గురైనట్లు తేలింది. ఆస్పత్రి సిబ్బంది వెంటనే హెబ్బగోడి పోలీసులకు సమాచారం అందించగా, ఘటనపై హెచ్‌ఎస్‌ఆర్ లేఅవుట్ పోలీస్ స్టేషన్‌లో అత్యాచారం కేసు నమోదైంది. యువతి పడిన స్థలం హెచ్‌ఎస్‌ఆర్ లేఅవుట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉంది. దీంతో హెబ్బగోడి పోలీసులు హెచ్‌ఎస్‌ఆర్ లేఅవుట్‌కు మెమో పంపారు.
బాధితురాలు ఓ ప్రైవేట్ ఆస్పత్రిలోని అత్యవసర విభాగంలో చికిత్స పొందుతోంది. ప్రస్తుతం అడిషనల్ కమీషనర్ ఆసుపత్రిని సందర్శించి యువతి ఆరోగ్యంపై ఆరా తీశారు. ఈ నేపథ్యంలో యువతి వార్డు దగ్గర అదనపు భద్రతా సిబ్బందిని మోహరించారు. బాధితురాలికి వైద్య పరీక్షలు కొనసాగుతున్నాయని హోంమంత్రి డా.జి.పరమేశ్వర్ తెలిపారు. బెంగళూరులో యువతిపై అత్యాచారయత్నం జరిగిన మాట వాస్తవమే. బాధితురాలికి వైద్య పరీక్షలు కొనసాగుతున్నాయని ఆయన బెంగళూరులో తెలిపారు. పోలీసులు విధివిధానాల ప్రకారం వ్యవహరిస్తున్నారు. అన్ని వైద్య పరీక్షలు కొనసాగుతున్నాయని తెలిపారు. నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని ఆయన వెల్లడించారు.
Read Also : Virat Kohli: 16 ఏళ్లుగా క్రికెట్ ప్రపంచాన్ని ఏలుతున్న కింగ్ కోహ్లీ..!